• Gona Buddha Reddy
  • Ebook Hide Help
    ₹ 89
    99
    10.1% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోన బుద్ధారెడ్డి

    Gona Buddha Reddy

    Publisher: S.R. Book Links

    Pages: 154
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలంగాణాలోని మునుపటి మహబూబ్ నగర్, ఇప్పటి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వర్ధమానపురం (వడ్డమాను-నందివడ్డమాను) పాలకుడైన గోన బుద్ధారెడ్డి క్రీ.శ. 13వ శతాబ్దిలో, రంగనాధరామాయణాన్ని ద్విపద చందస్సులో రాశాడు. ఇది ద్విపద చందస్సులో వెలువడిన తొలి తెలుగు రామాయణం. అంతకు ముందు తిక్కన అదే శతాబ్దంలో నిర్వచనోత్తర రామాయణాన్ని, తరువాతి శతాబ్ది (క్రీ.శ. 14)లో హుళక్కి భాస్కరుడు భాస్కర రామాయణాన్ని రాశారు. తరువాత క్రీ.శ. 16వ శతాబ్దిలో మొల్ల, మొల్ల రామాయణాన్ని, క్రీ.శ.17వ శతాబ్దిలో రఘునాధనాయకుడు రఘునాధరామాయణాన్ని, ఇదే శతాబ్దంలో కంకటి పాపరాజు ఉత్తరరామాయణాన్ని, కట్టా వరదరాజు ద్విపదలో వరదరాజ రామాయణాన్ని, 19వ శతాబ్దిలో గోపీనాధ వెంకటకవి, గోపీనాధ రామాయణాన్ని రచించారని, అటు తరువాత దాదాపు 50కి పైగా రామాయణాలు వచ్చాయని తెలుగు విశ్వవిద్యాలయము 2016లో ప్రచురించిన శ్రీ రంగనాధ రామాయణము (పూర్వోత్తర కాండములు) గ్రంథాన్ని పరిష్కరించిన ప్రముఖ చారిత్రక, సాహితీవేత్త డా. సంగనభట్ల నరసయ్య అదే గ్రంథానికి రాసిన అభిప్రాయంలో తెలియజేశారు. అంతేకాదు, ఎన్ని రామాయణాలొచ్చినా, గోనబుద్ధారెడ్డి రామాయణానికున్న ప్రశస్తి మరే రామాయణానికీ లేదని కూడ నరసయ్యగారు తేల్చి చెప్పారు.

- డా. ఈమని శివనాగిరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Gona Buddha Reddy