-
-
గాడ్స్ స్క్రీన్ ప్లే
Gods Screen Play
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 208Language: Telugu
Description
"తీసుకుందాం... అంటే కొందామని అర్థం కాదు. అలాగే ఇంకో రెండూ తలాతోకా లేని పెయింటింగ్స్ సెలెక్ట్ చేసాను. వాటిని కూడా తీసుకెళదాం."
కొంచెం దూరంలో గోడకున్న ఆ పెయింటింగ్స్‌ని చూపించాడు పోతురాజు.
నిజంగానే ఆ రెండు పెయింటింగ్స్ కూడా తలాతోకా లేని పెయింటింగ్సే! ఒక పెయింటింగ్‌లో ఏనుగు శరీరం మాత్రమే వుంది, తలాతోకా లేదు. ఇంకో పెయింటింగ్‌లో ఒంటె శరీరం మాత్రమే వుంది, తలాతోకా లేదు.
"ఇప్పుడు వీటిని తీసుకెళ్ళడం యెలా?" అప్పుడే అక్కడకొచ్చిన సేతురాజు అన్నాడు.
"మనసుంటే మార్గం అదే వుంటుంది. మీరు సరిగ్గా పెయింటింగ్స్ దగ్గరే నిలబడండి. అంతా క్షణంలో జరిగిపోవాలి. నేను మిమ్మల్ని రోడ్డు మిద కలుస్తా" అంటూ మేడ మెట్ల వైపు వెళ్ళి మేడ పై భాగంలోవున్న మెయిన్ స్విచ్ వైపు చూసాడు వీర్రాజు.
నలువైపులా ఒకసారి చూసి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసాడు.
కళాభవన్‌లో ఒక్కసారిగా గందరగోళం ప్రారంభమైంది.
Preview download free pdf of this Telugu book is available at Gods Screen Play
e novel peru kidnap