• Goda Devi Dhanurmasa Vrata Pasuramala
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోదా దేవి - ధనుర్మాస వ్రత పాశురమాల

    Goda Devi Dhanurmasa Vrata Pasuramala

    Publisher: Victory Publishers

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎన్నో వందల సంవత్సరాల క్రితం కేవలం రెండు వందల నలభై చిన్న చిన్న వాక్యాలతో గోదాదేవిచే గుదిగుచ్చబడిన తిరుప్పావై అనబడే పాశురమాల ప్రజల హృదయాలలో ఓ పవిత్ర పారాయణ ప్రబంధంగా నిలవడానికి కారణం ఎంత ఆస్వాదించినా తనివితీరని ఆ ప్రబంధ జ్ఞానామృత మాధుర్యమే!

ఆ మాధుర్యం కోసమే కాబోలు నిత్యమూ సుప్రభాత సేవతో గానీ మేలుకొనని ఆ కలియుగ వేంకటనాథుడు కూడా ధనుర్మాస కాలంలో మాత్రం ఈ తిరుప్పావై పాశుర పారాయణంతోనే మేల్కొంటాడు. ఎంత మాధుర్యం లేకపోతే స్వామివారు కూడా నిత్య సుప్రభాత సేవను కూడా కాదనుకుని తిరుప్పావై కోసం పరితపిస్తాడు!

మన వరాల దేవుడినే మెప్పించి, మైమరపించే ఆ పాశురమాల ఒలికించే అమృతపు మాధుర్యం “ఇలా” వుంటుందని ఎవరెన్ని ఉదాహరణలతో బోధపరిచినా అది కేవలం “రుచి” చూపించటమే అవుతుంది గానీ, పూర్తి మాధుర్యం ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవలసిందే!

ఉద్యోగరీత్యా నెల్లూరులో వున్నపుడు చిన్నబజారులోని కోదండరామ దేవాలయ అర్చకస్వామి ఈ తిరుప్పావైను శృతిమనోహరంగా ఆలపిస్తుండగా విని, వారిని ప్రార్థించి నేను నేర్చుకుని, ఆ మాధుర్యపు రుచిని ఆస్వాదించటం ప్రారంభించాను. ఆ తరువాత బదిలీపై విజయవాడ వచ్చిన తరువాత లబ్బీపేటలోని శ్రీవేంకటేశ్వర దేవస్థానంలో కొందరు భక్తులు ఇది పారాయణం చేయటం చూసి వారితో జతకలిశాను.

అయితే భక్తులు తిరుప్పావైతోపాటు ఇతర దేవతా స్తోత్రాలుకూడా పారాయణం చేస్తూ అవన్నీ ఒక పుస్తకరూపంలో లేక, వాటికోసం వివిధ పుస్తకాలు తిరగేస్తూ పడే అసౌకర్యం చూసి అలాగే తిరుప్పావై గురించి విని, సొంతంగా చదువుకోవాలనే ఆసక్తి వున్నవారు మధ్యమధ్యలో వచ్చే తమిళ అక్షరాలు ఎలా పలకాలో తెలియక వారు పడే ఇబ్బందిని చూసి తగిన తెలుగు అక్షరాలతో ఈ పాశురాలు మరియు స్తోత్రాలను ఓ క్రమపద్ధతిలో కూర్చితే బాగుంటుందని అనిపించిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ ధనుర్మాస వ్రత పాశురమాల.

ఈ పాశురమాలను కూర్చటానికి నాకున్న అర్హతల్లా నేను ఆస్వాదించిన మాధుర్యాన్ని నలుగురికి అందించాలనే తపనతో నేను చదివిన గ్రంథాలలోని కొన్ని విషయాలను ఇందులో కూర్చి, చదువరులను ఆ యా గ్రంథాల ద్వారా మరింత లోతుకు వెళ్ళి, దీని తత్త్వజ్ఞానసారాన్ని పొందటానికి పురికొల్పటమే తప్ప వేరు కాదు. ఆ తపన ఫలితమే ఈ ధనుర్మాస వ్రత పాశురమాల.

- అంగత వరప్రసాదరావు

Preview download free pdf of this Telugu book is available at Goda Devi Dhanurmasa Vrata Pasuramala