-
-
గాడ్ గిఫ్ట్
God Gift
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhupriya Publications
Pages: 445Language: Telugu
అది ఢిల్లీలోని ఒక ప్రముఖ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీ ఆఫీసు. స్కైటెల్ నెట్వర్క్వాళ్ళు ఎంగేజ్ చేసిన డిటెక్టివ్ ఏజన్సీ ఇదే. సెల్ వాడకుండా డైరెక్ట్‌గా చూసుకుంటూ మాట్లాడేస్తున్న యువతీ యువకులిద్దరూ ఎవరు? వాళ్ళు కనిపెట్టి వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటో కనిపెట్టేందుకు నియమించిన డిటెక్టివ్ ఏజన్సీ.
ఆ రోజు పది గంటల ప్రాంతంలో స్కైటెల్ కంపెనీ డైరెక్టర్స్‌లో ఒకరి నుంచి ఫోన్ కాల్ వస్తే డిటెక్టివ్ ఏజన్సీ హెడ్ రిసీవ్ చేసుకున్నాడు.
"ఏమైంది? వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా?” అడుగుతున్నాడు.
“మావాళ్ళు ఆ పనిమీదే ఉన్నార్ సార్” రిపోర్ట్ చేసాడు హెడ్.
"ఇప్పటికే మా డిటెక్టివ్ లిద్దరూ అమరావతిలో వున్నారు. మీ కంపెనీ ఏజెంట్‌ని కలిసి అతడి హెల్ప్ తీసుకుంటున్నారు. ఆ యువకుడు నీరుకొండ గెలాక్సీ బార్ అండ్ రెస్టారెంట్‌కి తరచూ వస్తాడని తెలిసింది. అతన్ని క్యాచ్ చేయటం చాలా ఈజీ సార్. నో ప్రాబ్లం. కాని ఇక్కడ ఢిల్లీలో అమ్మాయి విషయమే కాస్త ఇబ్బంది వ్యవహారం.
ఇప్పటికే మావాళ్ళు కారిబు రెస్టారెంట్లో ఎంక్వయిరీ చేసారు. ఆ అమ్మాయి పేరుగాని, కారు నంబర్ గాని ఎవరికీ తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడ వాళ్ళకి లేదు. ఆ అమ్మాయి అప్పుడప్పుడూ వచ్చి కాఫీ తాగి వెళ్తుందట. ఈసారి రాగానే ఫోన్ చేయమని నంబరిచ్చాం. అలాగే మా కుర్రాళ్ళు ఇద్దర్ని అక్కడే ఉంచాం.
జస్ట్ వన్నార్ టూ డేస్‌లో మావాళ్ళు యిద్దర్నీ కనిపెట్టేస్తారు. నో ప్రాబ్లం. అలాగే వాళ్ళు వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం అదీ తెలుసుకుంటాం. త్వరలోనే మీకు బెస్ట్ రిపోర్ట్ అందిస్తాం” అంటూ అంతవరకూ తమ ఇన్విస్టిగేషన్కి సంబంధించిన వివరాలు వివరించాడు హెడ్.
Payment procedure,link not working