• GoVilapam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • 'గో'విలాపం

  GoVilapam

  Pages: 82
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

‘గో’ అంటే గోవు, ‘గో’ అంటే భూమి. ఈ రెండింటినీ మనం హింసిస్తూ వుంటే, మనం వాటిని హింసిస్తున్నామని, మనపై ద్వేషం లేదు. పగ సాధించడం లేదు – పైగా ఆ రెండు మనలను గురించి విలపిస్తున్నాయి. అవి మనలను గురించి విలపిస్తూ ఉంటే మనం వాటి గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. అదే మన దౌర్భాగ్యం –

శ్రీ కృష్ణుడు, క్రీస్తు ప్రభువు అందరూ కూడా ఇతరులు యాతనపడుతూ ఉంటే వారి పట్ల దయ చూపుతారు. అలాగే గోమాత కూడా.

గోవుకి భారత దేశంలో అధిక ప్రాముఖ్యత వుంది. అంతే కాదు, గోవు గురించి దేశ విదేశాలలో కూడా అధికంగా అవగాహన ఉంది. గోవు విశ్వమాత – భూమి విశ్వమాత. సమస్త దేవతలకు నిలయమైనది గోవు. అంతే కాకుండా కాలుష్య నివారణకు, గ్లోబల్ వార్మింగ్‌ను నివారించడానికి, ఆయుర్వేదంలో ఉపయోగించే పంచగవ్యాలనిచ్చి మనకు ఉపయోగపడేది గోవు. కుల, మత భేధాలు లేకుండా ఈ విషయాలను అందరూ అంగీకరిస్తారు. గోదానం చేస్తే స్వర్గానికి చేరుకోవచ్చని, గోవు తనకు ఎవరూ తిండిపెట్టకపోయినా, గడ్డితిని, నీళ్ళు తాగి అమృతం వంటి మనకిస్తోందని తెలుసు.

ఒకనాడు గోమాత కన్నీరు కారుస్తూంటే, ఎందుకమ్మా! అని అడిగేడట ఒక భక్తుడు. “తన వల్ల అందరూ లబ్ది పొందుతున్నారని, తను మరణించిన తర్వాత కూడా చర్మంతోనో, కొమ్ములతోనో, గిట్టలతోనో అనేక విధాలుగా సొమ్ము చేసుకొంటున్నారని తెలుసు. వ్యవసాయానికి ఆవు, ఎద్దులు ఎంతో ఉపయోగమనీ, గ్రామాభివృద్ధి దాని సంతతితోనే సాధ్యమని, తానిచ్చే పాలు, పెరుగు, వెన్న, మూత్రం, గోమయం అన్ని ఔషధాలేనని – అన్నింటిని ఉపయోగించుకొని తనను చంపి ఒకేసారి సొమ్ము చేసుకొంటున్నారని, అలా చెయ్యవద్దనీ, చంపకండి మొర్రో – అని ఆవు విలపించడం లేదు. మరేమిటీ విలాపం ? ప్రపంచానికే తల్లి కాబట్టి, తన సంతానమైన యావత్ ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకొని తను బాధ పడుతోంది. తనను చంపితే తన సంతతిని నాశనం చేస్తే, పోషక పదార్థాలనిచ్చే పాలు లేకపోతే, మీరందరూ ఎలా బ్రతుకుతారని, చిన్నపిల్లలకు నా పాలు లేకపోతే, దానికి దీటైన ఆహారం వారికి దొరకదనా – తనను కసాయి శాలలకు పంపి, తన చావుకు మనం కారకులు కావడం ఆమె సహించలేదు. ఎందుకంటే ఆవు యొక్క రక్తపు బొట్లు ఎన్నయితే నేల మీద పడతాయో, అంతకాలం దేశానికి అరిష్టం, జన నష్టం, దుర్భిక్షం, అతివృష్టి, అనావృష్టి ఇత్యాది నష్టాలు వాటిల్లుతాయనీ, ఆ విధంగా ప్రజలు నష్టపోతున్నారనీ ఆమె వాపోతోంది. క్రొవ్వొత్తిగా తను కాలిపోయినా తాను భాధపడక – కొందరు చేసే తప్పులకు జనాభా మొత్తం శిక్ష అనుభవించడం, విశ్వశాంతి లోపించడం తట్టుకోలేక విశ్వమాతగా విలపిస్తున్నాను” . అందిట అదే మాతృప్రేమ.

Preview download free pdf of this Telugu book is available at GoVilapam
Comment(s) ...

గోవు సకల దేవతా స్వరూపము ఈ పుస్తకం రచించిన రచయితకు నా అభినందనలు..💐🙏🏻