-
-
గీతా దర్శనము
Gita Darshanamu
Author: Swami Srikantananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 220Language: Telugu
గీతా దర్శనము
ఆంగ్ల మూలం: స్వామి శ్రీకాంతానంద
తెలుగు అనువాదం: అమిరపు నటరాజన్
భగవద్గీతలోని, ఉపనిషత్తులలోని కొన్ని ముఖ్య శ్లోకాలకు భావార్థం పొందుపరచిన ''గీతాదర్శనం'' అనే ఈ పుస్తకం ఇప్పటి వరకూ పలు ముద్రణలకు నోచుకొన్నది.
భగవద్గీతాశ్లోకాలను సులువుగా అర్థం చేసుకోవడనికి వీలుగా శ్రీరామకృష్ణుల బోధనలనూ, పురాణేతిహాసలనుంచి కూడ కొన్ని కథలను చేర్చి సచిత్రంగా పొందుపరచాం. ఈ విధంగా విజ్ఞాన సర్వస్వమైన శ్రీమద్భగవద్గీతనూ, అందులోని తత్త్వాన్నీ జనసామాన్యం కూడా అలవోకగా ఆకళింపు చేసుకోగలరని విశ్వసిస్తూ తొలిముద్రణను 2004వ సంవత్సరంలో వెలువరించడం జరిగింది. ఈ పుస్తకానికి విశేష ప్రజాదరణ లభించడం మాకు మహదానందాన్ని కలిగించింది.
ఆస్తికులు, జిజ్ఞాసువులే కాకుండ యువకులు, ఉద్యోగస్థులు కూడ పనిలో నైపుణ్యాన్ని సాధించనికి, మానసిక ప్రశాంతతకు, వ్యక్తిత్వ వికాసానికి ఈ గ్రంథాన్ని చదవడం మాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. భగవద్గీత అంటే ఆధ్యాత్మిక చింతనాసక్తులకో, తత్త్వవివేచనాపరులకోకాక అన్ని వర్గాలవారికీ, అన్ని వృత్తులవారికీ ఉపయోగపే సార్వజనీన అనుష్టాన గ్రంథమని తెలియజెప్పే మా ప్రయత్నం ఈ పుస్తకానికి లభించిన ఆదరణతో సఫలీకృతమైందని భావిస్తూ, ఎప్పటిలాగే తెలుగు పాఠకులు సమాదరిస్తారని ఆశిస్తున్నాం.
- స్వామి జ్ఞానదానంద
గమనిక: "గీతా దర్శనము" ఈ-బుక్ సైజు 10 MB

- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108