-
-
ఘంటారావం
Ghantaravam
Author: Victor Hugo
Publisher: Hyderabad Book Trust
Language: Telugu
అటు విప్లవాలలోనూ, ఇటు సాహిత్యరంగంలోనూ కూడా ఫ్రాన్స్‌ది ఎప్పుడూ పైచేయి. అందుకే ఫ్రాన్స్‌ని 'విప్లవాల ఉయ్యాల' అన్నారు. ఇంచుమించు అన్ని సాహిత్య సిద్ధాంతాలకి పుట్టినిల్లు ఫ్రాన్స్.
ఈ ఘంటారావం నవల (1830) పదిహేనవ శతాబ్దపు 'పారిస్' నగరాన్ని పునరుజ్జీవింపజేసింది. ఫ్రెంచి సాహిత్యం సామాజిక జీవితంతో, చరిత్రతో పెనవేసుకుపోయింది. అందుకే కారల్‌మార్క్స్ అంతటి వాడు ' నేను ఫ్రాన్సు చరిత్రని ఫ్రెంచి సాహిత్యం నుంచి తెలుసుకున్నాను' అని కీర్తించాడు. సాహిత్యం ఎప్పుడూ నేల విడిచి సాము చేయదు. జీవితంలో ఊహలతో, సామాజిక జీవిత చిత్రణతో, చారిత్రక అంశాలన్నింటితో పడుగూ, పేకలాగా పెనవేసుకుపోతుంది. దీనికి ప్రత్యక్ష తార్కాణంగానే మన చెవుల ముందు ఈ 'ఘంటారావం' గణగణా మోగుతుంది.
"పారిస్ నగరం ఒక జంత్రవాద్య సమ్మేళనం. ప్రభాత ఘంటా నినాదం. ఒక అద్భుతగాన విశేషం. ఇటువంటి అద్భుతమైన నగరం ప్రపంచంలో అరుదు"
క్లోద్ఫ్రాలో, క్వాసిమోడో - ఇటువంటి ఇద్దరు విచిత్ర మానవుల ఆధీనంలో ఉన్న నోత్ర్డోమ్ చర్చి పట్ల పారిస్ నగరవాసులకు భీతి, శంక జనించాయి. వీటి విశ్వరూపం, సారాంశం తెలియాలంటే ఈ నవలని వెంటనే చదవండి.
- చలసాని ప్రసాద్.
