-
-
గాలిబ్ కవితా కౌముది
Ghalib Kavita Kaumudi
Author: Ramchander Deekonda
Publisher: Self Published on Kinige
Pages: 171Language: Telugu
'దీవానె-గాలిబ్' నుండి ఎంపిక చేసిన కవితలకు ప్రామాణిక తెలుగు అనువాదం. ఉర్దూ మూలం, తెలుగు లిపితో సహ. కఠిన పదాలకు అర్థాలు, భావ వివరణ.
* * *
"...నిజంగా ఒక విశిష్టానువాదం... ఈ అనువాదకృతి గాలిబ్ గుండెలో చొరబడి చేసిన చిక్కని రచన... గాలిబ్ కవితా జీవనాడిని పట్టుకున్నారు.... గాలిబ్ కవితల్తోని రసవత్తను చమత్కృతిని స్పష్టపరచారు...".
- ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
"అనువాదం ప్రామాణికంగా ఉంది. ఎంతో పరిశోధించి సాధించిన ఫలితమిది... ప్రస్థానత్రయీనీ, వాల్మీకి భవభూతి కాళిదాసాదులనూ ఉటంకించి గాలిబ్పై భారతీయ వేదాంత పురాణేతిహాసాల ప్రభావాన్ని వివరించిన తీరు అపురూపం, అనువక్త విద్వత్తుకు అద్దం పట్టింది."
- ఆచార్య వల్లపురెడ్డి బుచ్చారెడ్డి
"...గాలిబ్ని అధ్యయనం చేసి, కవితల్లోని భావమాధుర్యాన్ని, చమత్కారాన్ని ఆకలనం చేసుకున్నారు."
- ప్రొ. రహ్మత్ యూసఫ్ జ’ఈ
"అనువాదం చాలా అందంగా, మూలానికి సన్నిహితంగా ఉంది. భావస్ఫోరకంగా, ఉర్దూలోని భావం పొల్లుపోకుండా.... సరళమైన తెలుగులో అనువదించారు. ఉర్దూ సాహిత్యంలోని మాధుర్యాన్ని రుచి చూపించదలచి సఫలమయ్యారని భావిస్తున్నాను."
- లక్షణ్రావు పతంగే
