-
-
జనరల్ నాలెడ్జ్
General Knowledge
Author: K. KrishnaReddy
Pages: 195Language: Telugu
నేడు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు వారికోసం పుస్తకాలు కూడ తామర తంపరగా ప్రచురితమవుతున్నాయి. వాటిలో తమ అవసరాలను తీర్చకలిగిన పుస్తకాలను ఎంపిక చేసుకోవడం ఉద్యోగార్థులకు ఓ పెద్ద సమస్యగా ఉంది. పైగా వాటిలో సాధికారమైనవి ఏవో తేల్చుకోవడం మరింత కష్టంగా ఉంది. ఈ స్థితిలో సులువైన, సురక్షితమైన మార్గం ప్రామాణిక రచయితల పుస్తకాలపై మాత్రమే ఆధారపడటం. ఆ ఉద్దేశంతోనే కొద్దికాలం క్రితం కె కృష్ణారెడ్డి రచించిన 'జనరల్ స్టడీస్, అబ్జెక్టివ్ ప్రశ్నలు- సమాధానాలు' పుస్తకాన్ని అందించాము. ఇదే రచయిత 'జనరల్ నాలడ్జ్'ను ప్రచురిస్తున్నాము. జాగ్రఫీ, చరిత్ర, సంస్కృతి, ఎకానమీ, సైన్స్ తదితర అంశాలకు సంబంధించిన వివరాలను వీటిలో ఆయన పొందుపరిచారు. పోటీ పరీక్షల కోసం సన్నాహానికి ఈ రెండు పుస్తకాలు అనివార్యమైనవని వేరుగా చెప్పనక్కరలేదు.
కె. కృష్ణారెడ్డి ఆంధ్ర దేశంలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్ధి, ఉద్యోగార్థులకు సైతం చిరపరిచితులు. ఇటీవల కాలం వరకు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సివిల్ సర్వీసు పరీక్షల శిక్షణా సంస్థను సమర్ధవంతంగా నిర్వహించారు. ఇప్పుడు దేశంలోని పలు ప్రాంతాలలో విద్యార్థులకు సివిల్ సర్వీసు, ఇతర పోటీపరీక్షలలో శిక్షణ అందిస్తున్నారు. వారు చరిత్ర విషయాల ప్రముఖ రచయిత. భారత దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర సంస్కృతులపై వారు రచించిన అనేక గ్రంథాలు విశేషాదరణ పొందుతున్నాయి. ప్రజాశక్తి బుక్ హౌస్ గత ఏడాది ప్రచురించిన 'భారత సమగ్ర చరిత్ర' ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు, స్వాతంత్య్ర పోరాటం- అనే నాలుగు వాల్యూములు విద్యార్థి, ఉద్యోగార్థులే కాకుండా చరిత్ర పట్ల ఆసక్తి కలిగిన సాధారణ పాఠకులు సైతం చక్కగా వినియోగించుకుంటున్నారు.
- ప్రచురణ కర్తలు
