-
-
గీరతం
Geeratham
Author: Tirupati Venkata Kavulu
Publisher: Soundaryalahari Prachuranalu
Pages: 151Language: Telugu
తిరుపతి వేంకటకవులు వీరోచితంగా జరిపిన సాహితీసమరాల సారసంగ్రహం ఈ గీరతం. ఇందులో ప్రతి పర్వమూ చారిత్రకమే. ప్రతి పద్యమూ ఒక రత్నమే. చదువుతున్నప్పుడల్లా తనువు అణువణువునా ఉప్పొంగుతుంది. ఆ సమరాంగణంలోకి మనమూ దూకేసిన అనుభూతి కలుగుతుంది.
- బేతవోలు రామబ్రహ్మం
*****
పుంభాన సరస్వతులు శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి, శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి నామధేయులై, తిరుపతి వేంకటకవులుగా జగత్ప్రసిద్ధులైన ఈ జంటకవులు కారణజన్ములు. తమ కవితాధారా స్రవంతులతో తెలుగు సాహిత్యపు మాగాణములను సస్యశ్యామలం చేసిన మహానుభావులు. “అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యం గల్గు దేశంబునన్....” అంటే తెలుగు నేల నాలుగు చెరగుల అవధాన దిగ్జైత్ర యాత్రలు సలిపిన వారు. దేవీ భాగవతము, బుద్ధ చరిత్రము వంటి మహాకావ్యాలు, శతావధానసారము, నానారాజ సందర్శనము – వంటి అవధాన ‘పద్య’ సంకలన గ్రంథాలతో, ‘పాండవోద్యోగ’, ‘పాండవ విజయా’ది పద్యనాటక రచనలతో తిరుపతి వేంకటకవులు సాహితీ విరాణ్మూర్తులుగా అజరామరమైన కీర్తి గావించినారు.
తిరుపతి వేంకటకవులకు, వేంకటరామకృష్ణకవులకు మధ్య జరిగిన వాద ప్రతివాదనములే “గీరతము”లోని ఇతివృత్తం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం గురువుగారిని నిందించటం, విమర్శించడం క్షమింపరాని అపరాధం. ఆనాడు తిరుపతి వేంకటకవులకు, కొప్పరపు సోదరకవులకు మధ్య జరిగిన వాదాలు, ప్రతివాదాలు కూడా సాహితీ రసజ్ఞలోకానికి రసవత్తర’వినోద’ విజ్ఞానాలనందించాయి. “గీరతము” కూడా అటువంటి విజ్ఞానవినోదాల నందించే కావ్యమే.
- మేడసాని మోహన్
