-
-
గేదె మీది పిట్ట
Gede Meedi Pitta
Author: Patanjali Sastry
Publisher: Chinuku Publications
Pages: 119Language: Telugu
“అతనెవరు” అన్నాడు ప్రకాష్ ఆది.
“ఓ ఫ్రెండు. నీ అంత కాదు. వాడి పేరు రాజు” నవ్వాడు ప్రకాష్.
“అప్పుడప్పుడు కలిసి పనిచేస్తా ఉంటాం. మనోడు ఎక్కువ ‘కాకతీయ టవర్సు’ దగ్గిరుంటాడు. ఎక్కువగా బయటికి పోడు. అంతా హెూటల్లోనే”
“ఓకే. ఏం చేద్దాం” అన్నాడు ప్రకాష్
“అదే చెప్తా ఉన్నా, పెద్ద ఫాంహౌస్ గురూ అది. మనం ముగ్గురం. వాళ్ళు ముగ్గురనుకుంటాను. మందూ అదీ సరే. Just one night”
“డ్రగ్స్ వద్దు. డ్రగ్సుంటే నేను రాను. సారీ.”
“అన్నా డ్రగ్సుంటే నేనస్సలు పోను. దూరంపెడతా, believe me”
“ఓకే వాళ్లెవరు?”
“నాకంతగా తెలవదు. రాజుకి పరిచయం. ఏవో ఉద్యోగాలు చేస్తారనుకుంటా. అడిగేవనుకో కతల్చెప్తారు. నీకు తెల్సుగదా? మన పైసలు మనకి ఖచ్చితంగా రావాలి. బస్. నీకు ఓకే గదా?”
“ఓకే.”
“రేపు ఏడుగంటలకి నిన్ను ఈణ్నే పికప్ చేస్తా. రాజొస్తాడు.”
“ఇప్పుడేంది? ఇంటికి పోవాల్నా?”
“ఒద్దా?”
బాలు నవ్వాడు. "దా బాస్, లోపలికి బోయి ఓ గంట కూచుని పోదాం.” వాచీ చూసుకున్నాడు ఆది. అయిదయింది. ఇద్దరూ లోపలికి బార్లోకి దారి తీశారు. బాలు ఓ లార్జి విస్కీ పెగ్గు, ప్రకాష్ బీరూ చెప్పేరు. బేబీ కార్న్ మసాలా నములుతూ కబుర్లు చెప్పుకుంటూ కూచున్నారు. సరిగ్గా గంట దాటగానే లేచారిద్దరూ. బిల్లు కూడా సరిగ్గా చెరిసగం పంచుకుని బయటికి వచ్చారు. కొంతదూరం బైకులో కలిసి వెళ్లారు. తరవాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.

- ₹108
- ₹270
- ₹75.6
- ₹540
- ₹90
- ₹216