-
-
గతం పాతర నుంచి మతం జాతరలోకి
Gatam Patara nunchi Matam Jataraloki
Author: Dr. A.B.K. Prasad
Publisher: Basaveswara Prachuranalu
Pages: 380Language: Telugu
ఈ రాష్ట్రంలోనే గాదు, మొత్తం మనదేశంలోనే ప్రజాబాహుళ్యం ప్రయోజనాలకు పూర్తిగా అనుకూలమైన, ప్రజాసంక్షేమం దృష్ట్యా జాతీయ ప్రయోజనాలకు, భద్రతా వ్యవస్థకూ సర్వసమగ్రమైన విధాన రూపకల్పన, సునిశతమైన కార్యాచరణ, అందుకు తగిన అప్రమత్తత అటు పాలకులకు కొరవడుతూ వస్తున్నందువల్లనే ప్రజలలో తగినంత చైతన్యం పెరగకుండా పోయింది. ఈ రెండు అశ్రద్ధలవల్ల దేశీయంగానూ, సరిహద్దులలోనూ కూడా అనూహ్యమైన పరిణామాలకు ప్రజలు అలవాటు పడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కాశ్మీర్ సహా ఇరుగుపొరుగుతో మన సరిహద్దుల సమస్యలు ఎప్పుడు శాశ్వతంగా పరిష్కార మవుతాయో చెప్పలేం; దేశంలో సామాన్య ప్రజానికం ఆర్థిక, సామాజిక సమస్యలకు, అంతరాల దొంతర్లకు పరిష్కారం ఎప్పుడు కుదురుతుందో చెప్పుకోలేని పరిస్థితి! ఈ లోగా గతం పాతరలు తవ్వుకుంటూ మతం జాతరలోకి మెడలు చాచుకుంటూ కాలక్షేపం చేయడానికి అలవాటు పడిపోయిన దుర్గతీ, దుస్థితీ మరొకవైపున మనల్ని కాళ్ళూ చేతులూ కట్టిపడవేస్తున్న అయోమయ పరిస్థితి!
వీటన్నింటి మధ్య ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అగ్గి పెట్టి సమిధలు దట్టించే ఆర్థిక, సామాజిక సమస్యలు ఉన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. వాటికి యుద్ధ ప్రాతిపదికమైన పరిష్కార మార్గాలను సమిష్టిగా వెతకాలి. అసంఖ్యాక కష్టజీవులను, మైనారిటీలకు కలుపుకుని రాగల కేవలం ప్రజాప్రయోజానాలు మినహా మరొక అజెండాతో నిమిత్తంలేని కనీస కార్యాచరణ పథకంతో ముందడుగు వేయనంతవరకు అజ్ఞాత శక్తులకు, ముసుగు వీరులకు, ఉగ్రవాదులకు ఒక రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాలూ 'అడ్డా'లుగా మారక తప్పదు!
- డా. ఎ. బి. కె. ప్రసాద్

- ₹108
- ₹216
- ₹270
- ₹216
- ₹270
- ₹216