-
-
గంధర్వ యజ్ఞం 1
Gandarva Yagnam 1
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 229Language: Telugu
మనిషన్నాక హక్కులు మాత్రమే కాదు. భాధ్యతలు తెలిసి ప్రవర్తించాలి. కాస్సేపు వెయిట్ చేయండి. అంటూ సూర్యాపేట ఎస్సైకు ఫోన్ కొట్టాడు. అర్ధరాత్రి ద్వాపర్ ఫోన్ చేయగానే అదిరిపడి లేచి కూచున్నాడు ఎస్సై.
హైవేను గాలికొదిలేసి హ్యాపీగా ముసుగుతన్ని నిద్రపోతున్నావా వెంటనే నీ స్టాఫ్‌తో విజయవాడ వైపురా. లోబ్రిడ్జి దగ్గర నీ కోసం అతిధుల్ని సిద్ధంగా వుంచాను. కంఫాస్ట్.
ఓర్నాయనో, నిద్ర చెడగొట్టింది చాలక నన్ను టెన్షన్ పెడుతున్నావురా ద్వాపర్. అసలీ టైంలో అక్కడెందుకున్నావ్? ఏం జరిగిందసలు? అటునుంచి అరిచాడు ఎస్సై. ఎలాగూ వస్తున్నావ్‌గా. నువ్వే తెలుసుకుంటావ్. పావుగంటలో ఇక్కడుండాలి. అటువైపు ఎస్సై అరుపుల్ని పట్టించుకోకుండా లైన్ కట్ చేసాడు ద్వాపర్.
సరిగ్గా ఫోన్ చేసిన ఇరవయ్యో నిమిషంలో తన బుల్లెట్ బెైక్ మీద ముందుగా రివ్వున దూసుకొచ్చేశాడు ఎస్సై. ఆ వెనుకే పదిమంది స్టాఫ్‌తో కూడిన పోలీస్ వ్యాన్ ఒకటి గాలితో పోటీ పడుతూ వచ్చి ఆగింది.
ఒక కొత్త తరహా ఆలోచన.. చాల బాగుంది.. 2 పార్ట్శ్ గుడ్
Ok
Time pass