-
-
గణపురం కోటగుళ్ళు
Ganapuram Kotagullu
Author: Kanuganti madhukar
Publisher: District Public Relation Officer, Warangal
Pages: 28Language: Telugu
Description
కాకతీయుల పూర్వ వైభవానికి చిహ్నాలుగా వరంగల్ జిల్లాలొ ఎన్నో కట్టడాలు, ప్రాకారాలు, పురాలు, తటాకాలు ఇంకా మన కళ్ళెదుటే వున్నాయి. నాటి మహోజ్వలమైన సామ్రాజ్యంలో మనం జీవించి లేనప్పటికీ... నాటి అపురూప పరిపాలనకు ఆనవాళ్ళుగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాచీన కట్టడాలు సజీవంగా మన ముందు నిలిచివున్నాయి. ఎన్నో దండయాత్రలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని అవి మనల్ని అచ్చెరువు గొలుపుతుంటాయి. అటువంటి వాటిలో గణపురం కోటగుళ్ళు ఒకటి.
కాకతీయుల ఘనమైన కళా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి మరోసారి చాటేందుకు నిర్వహిస్తున్న కాకతీయ ఉత్సవాలలో భాగంగా జరిగిన గణపురం ఉత్సవాల సందర్భంగా గణపురం కోటగుళ్ళపై పుస్తకాన్ని ప్రచురించడమైనది. గణపురం కోటగుళ్ళ చరిత్ర, ఆలయ విశేషాలు తెలిపే ఈ పుస్తకం ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాము. - ప్రచురణకర్త
Preview download free pdf of this Telugu book is available at Ganapuram Kotagullu
Login to add a comment
Subscribe to latest comments
