-
-
గాలిపటం
Galipatam
Author: Sannihith
Publisher: Self Published on Kinige
Pages: 96Language: Telugu
ఒక వ్యక్తి స్నేహితులను చూసి ఆ వ్యక్తి ఎటువంటి వాడో మనం చెప్పేయవచ్చు. అలాగే ఓ రచయిత రచనలు చదివి అతని వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. 'గాలిపటం' కథాసంపుటిలోని కథలు చదివినప్పుడు రచయిత శ్రీ సన్నిహిత్గారిలో సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల ఆవేదన, సమాజం ఎలా ఉండాలో చెప్పాలన్న ఆలోచన, అలా ఉంటే బాగుంటుందన్న ఆశావహ దృక్పథం మనకు కనిపిస్తాయి.
రచయితకు ముఖ్యంగా ఉండవలసిన ముఖ్య లక్షణాలు మూడు! మొదటిది- పుస్తకాలు ఎక్కువగా చదవడం, రెండవది- తన చుట్టూ ఉన్న మనుషులను పరిశీలించడం, మూడవది- సమాజంలోని పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం. ఈ సంపుటిలోని కథలు చదివాక ఈ మూడు లక్షణాలూ శ్రీ సన్నిహిత్లో పుష్కలంగా ఉన్నాయనిపించింది. కథలన్నీ మానవీయ విలువలతో నిండుకొని, పాఠకులను చదివింపజేసి, తర్వాత ఆలోచింపజేస్తాయి. ఇందులో ఊహాజనితమైన కథావస్తువులు కాని, పాత్రలు గాని లేవు. పాఠకులు ప్రతిరోజూ తమ దైనందిన జీవితంలో తారసపడే పాత్రలు, తరచూ చూసే సంఘటనలు ఈ కథలలో కనిపిస్తాయి కనుక వారు శ్రీ సన్నిహిత్ను తమ సన్నిహితుడైన ఓ మిత్రుడిలా భావిస్తారు.
- సి.ఎన్. చంద్రశేఖర్

- ₹108
- ₹60
- ₹72
- ₹108