“ఆ మధ్య ఎవరో అడిగారు సుగుణా ఈ ప్రపంచంలో అత్యంతంగా ప్రేమించేవ్యక్తి ఎవరూ అని... దానికి నేనేం జవాబు చెప్పానో తెల్సా?” అన్నాడు మురళీకృష్ణ.
“ఏం చెప్పుంటారు... నా భార్య సుగుణ అన్జెప్పుంటారు”: క్యాజువల్‌గా అంది సుగుణ.
“అలా చెప్పలేదు. నేనే అన్నాను”
“ఏమిటీ?”
“ఔను సుగుణా! నిజం. నేనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏ రోజన్నా ఎవరైనా ఎక్కువగా హర్ట్చేస్తే నన్ను నేను క్రూరంగా నిందించుకుంటాను. ఏ అందమైన వాగు దగ్గరన్నా నేను నిలబడితే ఆలోచనా సులోచనాల్ని నిర్మించుకుని ఎవరికీ చెప్పకుండా నాలోనే దాచుకుని ఎంతబాగా ఆలోచించాను అని నన్ను నేను అభినందించుకుంటాను. రాత్రుళ్ళు నువ్వు గుర్తొస్తే విరహం మీద గొప్ప పొయిట్రీ రాసేసి నాకు నేనే నోబుల్ ప్రైజ్ ఇచ్చేసుకుంటాను. ఇవన్నీ నాలోజరిగేవి. అందుకే నేనంటే నాకు చాలా ఇష్టం.”
“పోలీసువాళ్ళంటే రాక్షసులనే నా అభిప్రాయాన్ని తుడిచెయ్యడంతో పాటు మీమీద ప్రేమనీ గౌరవాన్నీ మరింత పెంచారు. మీరంటే మీకిష్టం అనేదాన్ని నేను ఒప్పుకుంటున్నా. మీ తర్వాత ఇష్టమైంది నేనేగా?”.
హత్యచేసిన సుగుణేనా తన భర్తతో ఇంత చలాకీగా ఛలోక్తులు విసురుతూ మాట్లాడుతుందు అన్పిస్తుంది. పోన్లే ఆ సంఘటనని ఒక పీడకలలా మర్చిపోదాం అనుకున్నారు. సుగుణ చేసిన హత్య సంగతి తెల్సిన మాలీ, హరిబొంధూ, జగన్నాథం.
కణకణమండే రాక్షసి బొగ్గుని పచ్చని గుడ్డతో గట్టారనీ, ఏదో క్షణాన గుడ్డకాలి పొగతో మొదలై తర్వాత మండుతుందని తెలియదు వాళ్ళకి. చేసిన హత్యని సమాధిచేస్తే దానిపై మొక్కలు మొలిచి పూస్తున్న పూలు ఆ చుట్టూ వున్న ప్రకృతంతా పరిమళించి రహస్యాన్ని బయట పెడతాయని తెలీదు వాళ్ళకి. రాహువు రాబోతుందని తీతువు కూస్తున్న సంగతి తెలీదు వాళ్ళకి.
Enable rent option please