-
-
గాజు పల్లకీ
Gaju Pallaki
Author: P. S. Narayana
Publisher: Pratibha Publications
Pages: 129Language: Telugu
చీకటిలో... పెనుతుఫాన్లో చిక్కుకుందో రైలు. దిక్కుతోచక అల్లాడిపోతున్న జనంలోంచి నలుగురు ఒక యింటిని చేరుకున్నారు. నలుగుర్లో మల్లిక సుమధుర మనోనాయిక. మిగతా ముగ్గురు మగధీరులు.....
మల్లికకు కన్ను చెదిరే అందముంది. గొప్ప మనసుంది. ఒక మాయగాడి దాడిలో వంచితగా మిగిలిన గతముంది. అందుకు చిహ్నంగా బిడ్డని కడుపుతో వుంది... మల్లిక కథ విన్న ముగ్గురూ తమ ఔదార్యాన్ని ప్రకటించుకున్నారు.
వెండి జలతారు తెర మీద నిన్ను మహారాణిని చేస్తాను... అందు కర్పించాలి నీ శరీర సంపద - అన్నాడు సినీ నిర్మాత - ఆ ముగ్గురిలో ఒక విధాత.... నీ బొమ్మ నా గుండెల్ని ఆక్రమించుకుంది... నీకోసం పడి చస్తానన్నాడు రెండో కథానాయకుడు విశ్వప్రేమికుడు. నీ గతం నాకొద్దు.. నిన్ను పెళ్ళాడి, నీ బిడ్డకు తండ్రవుతాను అని ముందుకొచ్చాడు మహా మనీషి - మూడో మనిషి.
తానెవరి గుండెల్లో కురిపించాలి పన్నీటి జల్లు? ఎవరి మనోవీధిలో తానవ్వాలి హరివిల్లు?.
ఆమె ముందరున్నది ముద్దుమురిపాల ముత్యాల పల్లకీ, మాయ మంచు పల్లకీ, చిన్న కుదుపుకీ కాలి మోపుకీ ముక్కలయ్యే 'గాజు పల్లకీ'! మల్లిక ఎన్నిక మీ ముందుంచుతున్నాం - సుమధుర గీతికగా తెలుగు తొలి న్యూవేవ్ నవలికగా.....
- ప్రచురణకర్తలు
