-
-
గజ ఈతరాలు
Gaja Eetaralu
Author: Gorusu Jagadeeshwara Reddy
Pages: 144Language: Telugu
ప్రపంచీకరణ పుణ్యమా అని ఆల్విన్ వాచ్ కంపెనీ మా అందరికీ 'వి.ఆర్.ఎస్' ఇచ్చి రోడ్డు పైకి గెంటిన తర్వాత మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. పదహారేళ్ళుగా పని చేసిన కంపెనీ నుండి ఒక్కసారిగా బయటకి వచ్చాక ఇక కంపెనీకి మాకు ఏలాటి సంబంధం లేదనుకోగానే తీవ్ర దుఃఖం కలిగేది. కన్నతల్లి హఠాత్తుగా మరణించి, ఇక ఆమె కనబడదన్న నిజాన్ని జీర్ణించుకోలేనంత బాధ అది.
చాలా రోజులవరకు మనుషులం కాలేకపోయాం. కలలో కంపెనీ కన్పించేది. యంత్రాల మధ్య పచార్లు చేస్తున్నట్లు ఉండేది. మట్టి స్పర్శకు పులకించిపోయేది రైతైతే యంత్రాలు తడిమి అలౌకిక ఆనందం పొందేవాదు కార్మికుడు. రైతుకూ నేలకూ ఉన్నట్టే.... కార్మికుడికి యంత్రానికి మధ్యనున్న మమకారాన్ని, అనుబంధాన్ని కథగా చెప్పాలనుకున్నాను.
అదీ.... మా 'బతుకుచిత్రం'.
ఈ కథల సంపుటికి బాపుగారు వేసిన ముఖచిత్రం.
- రచయిత
'బతుకుగోస' కథానేపథ్యం నుండి
చిక్కని కథలు.
కథల శిల్పానికి వన్నె తెచ్చిన కథలు.
అకస్మాత్తుగా కాళ్ళ క్రింద నేల జారిపోతే? ఎవరిని తిడుతూ కూర్చుంటారు? ఆ తర్వాత ఏదో ఒక ఆధారంతో నిలబడితే, అనుభవాల డాక్యుమెంట్ ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది.
ఇంతకీ ఆల్విన్ కంపెనీ మూసెయ్యడానికి కారణం ప్రపంచీకరణా? లేక అడుగడుగునా తాండవించన మనిషి స్వార్థమా?