-
-
జి.యస్. లక్ష్మి హాస్య కథలు - వదినగారి కథలు
G S Lakshmi Hasya Kathalu Vadina Gari Kathalu
Author: G.S. Lakshmi
Publisher: Self Published on Kinige
Pages: 101Language: Telugu
జి.యస్. లక్ష్మిగారి కథల్లో హాస్యం ఇప్పుడొస్తున్న సినిమాల్లో కామెడీ ట్రాక్లాగా విడిగా ఉండదు. కథలో కలిసిపోయే ఉంటుంది. కాబట్టి నవ్వు తెచ్చుకోనవసరం లేకుండా దానంతట అదే వచ్చేస్తుంది.
కథల్లోని పాత్రలన్నీ మనకు చుట్టూ వున్నవే. కాబట్టి ఇలాంటి వాళ్లను మనమూ చూసాం అనిపిస్తుంది. ఉదాహరణకు తాపీగా వంటచేసే మరదలూ, మొబైల్ యుగంలో పెళ్ళిచేయించే పురోహితుల సమయ స్ఫూర్తి హాయిగా నవ్విస్తాయి. ఇలాంటి చెణుకులూ చమత్కారాలు చాలా వున్నాయి మరి. కాబట్టి అలవోకగా చదివేసుకోవచ్చు.
ఈ పుస్తకంలో కథలు కొన్ని పే...ద్దవి. కొన్ని చాలా చిన్నవి. ఆఖరున వదినగారి కథలు వున్నాయి నిండుగా. ఆ వదినగారు కంప్యూటర్లో కథలు చదివేవారికి చిరపరిచితులే. ఆవిడంటే అందరికీ అభిమానమే.
- పొత్తూరి విజయలక్ష్మి
"నువ్వు కామెడీ బాగా రాస్తావమ్మా!" అన్న మా అమ్మాయి మాటలకి ప్రభావితురాలినయ్యి నేను హాస్య కథలు రాసేందుకు సాహసించాను. అందరికీ తెలిసిన విషయమే. హాస్యం రాయడమంటే కత్తి మీద సాములాంటిది. కాస్త మోతాదు తక్కువయితే పండదు. ఎక్కువయితే వెగటు పుడుతుంది. అందుకే కేవలం ఆహ్లాదకరమైన హాస్యాన్నే అందరూ ఇష్టపడతారు. ఇందులో కథలన్నీ అహ్లాదకరమైనవేననే హామీ ఖచ్చితంగా ఇవ్వగలను.
ఈ పుస్తకంలో అందరూ నచ్చి, మెచ్చిన “వదినగారి కథ"లను కూడా చేర్చాను.
- జి.యస్. లక్ష్మి
కినిగె టీమ్ కు ధన్యవాదాలు..