-
-
ఫ్యూచర్
Future
Author: Pasupuleti Tata Rao
Publisher: Self Published on Kinige
Pages: 196Language: Telugu
సుమన్ అతను గురిపెట్టిన వైపు ఆకాశంలోకి చూసాడు. అప్పుడే గాల్లోకి లేచిన విమానం పెద్ద శబ్ధం చేసుకుంటూ అటువైపే నెమ్మదిగా వస్తోంది. అప్పుడే రన్వే మీంచి లేచింది కాబట్టి భూమ్మీదనుంచి ఎంతో ఎత్తుకి ఎగరలేదింకా. బాణంతో అంత దూరంనుంచి కొట్టడం మామూలుగా సాధ్యం కాదు. కానీ వీణ్ణి ప్రత్యేకంగా సౌత్ఆఫ్రికా అడవుల నుంచి రప్పించారు కాబట్టి వాడికి సాధ్యమవుతుందేమో?
సుమన్ మెదడు చురుకుగా పనిచేసింది. క్షణం ఆలస్యం చేసినా ఘోర ప్రమాదం జరిగిపోతుంది. అసంకల్పితంగా అతని చేయి జేబులోకి వెళ్ళి రివాల్వర్ని బయటకి తీసింది. చేయి సాధ్యమైనంత ముందుకు చాపి కసిగా ట్రిగ్గర్ నొక్కాడు. సైలెన్సర్ అమర్చి ఉండడం వల్ల పెద్ద శబ్ధం రాలేదు. రివాల్వర్ నుంచి దూసుకెళ్ళిన బుల్లెట్ ఆ నల్లని తుమ్మమొద్ధు తలలోకి దూసుకు పోయింది. వాడు నిలువునా కుప్పకూలిపోయాడు. అతని చేతినుంచి జారిన బాణం గాల్లోకి కొంత దూరం ఎగిరి కింద పడిపోయింది.
