-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఫ్రెంచి పాలనలో యానాం (free)
French Palanalo Yanam - free
Author: Bolloju Baba
Publisher: Self Published on Kinige
Pages: 210Language: Telugu
విస్త్రృతమైన జాతీయ చరిత్ర రచనకు ప్రాంతీయ చరిత్రల అధ్యయనం, విశ్లేషణ అత్యావశ్యకం. పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో చారిత్రక రచనలలో ఈ పరిణామం చోటు చేసుకుంది. "ఫ్రెంచి పాలనలో యానం" అనే ఈ చిన్న ప్రయత్నం పైన పేర్కొన్న విశాల దృక్పధంతో చేసినదిగా భావించడం సముచితంగ ఉంటుంది. రచయితకు తన ఊరిపట్ల ఉన్న ప్రేమ, దాని చరిత్ర పట్ల ఉన్న జిజ్ఞాస ఈ రచనలో ప్రతి చదువరి గమనిస్తాడు.
ఈ రచనా పరిధిని ఫ్రెంచ్ కాలానికే పరిమితం చేస్తూ అంతకు ముందు కాలానికి సంబంధించిన పురావస్తు అధ్యయనాల ఆవశ్యకతను సూచిస్తూ తనకు అందుబాటులో ఉన్న వాఙ్మయ, లిఖిత ఆధారాలతో అనేక చారిత్రక ఘట్టాలను, విశేషాలను వివరిస్తూ అందుకుగల కారణాలను విశ్లేషించాడు. ఇది ఒక చారిత్రక రచనకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. తన అధ్యయనానికి అవసరమైన విషయ సేకరణ జరిపిన పద్ధతి కూడా సరిగా ఉంది. ఫ్రెంచ్ వారి సమాధులు, ఆనందరంగ పిళ్ళై డైరీలోని విశేషాల విశ్లేషణలో రచయిత చారిత్రక స్పృహ, సునిశిత దృక్పధం తేటతెల్ల మౌతాయి. యానాం ప్రాంత చరిత్ర రచనకు ఫ్రెంచ్ వారికి పూర్వం రెడ్డి రాజుల కాలం నాటి పురావస్తు, వాఙ్మయ ఆధారాలు కూడా అద్యయనం చేస్తే బాగుండేది. రచయిత కృషి అభినందనీయం. యువ చారిత్రక పరిశోధకులకు ఆచరణీయం కూడా!
- డా. నవులూరి చంద్రమౌళి
I want a hard copy how can I buy it