-
-
ఫ్లోరోసిస్... ఫ్లోరోసిస్...
Fluorosis Fluorosis
Author: Dr. Roop Kumar Dabbikar
Publisher: Palapitta Books
Pages: 43Language: Telugu
Description
లక్షల గొంతుకలు మీటుకుంటూ పారవలసిన నీటి పాట అపశ్రుతుల స్వరాల నాలాపిస్తూ జనం గొంతులో విలాప రాగాల తీర్థం పోస్తూ, విషపు ప్రవాహమై కాటువేస్తూ తెలంగాణలోని కొన్ని పల్లె ప్రాంతాల, జానపదుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.
నల్లగొండ జిల్లాలో తీవ్రంగా వున్న ఫ్లోరోసిస్ సమస్య ఈ దీర్ఘకవితకి ఇతివృత్తం.
* * *
శబ్దాన్ని ముక్కలుగా చేయకు
శబ్దం కోటి గొంతుకల ఆర్తనాదం
శబ్దాన్ని ఓంకారపు ముసుగులో దాచకు
శబ్దం దాహార్తుల నినాదం
శబ్దాన్ని నిశ్శబ్దం నుండి వేరు చేయకు
శబ్దం రాజకీయపు నక్కల జిత్తుల్ని
ధ్వంసించే అంకుశం
శబ్దం
రక్తపు మరకలంటిన నీటి పగల కుత్తుకల
కత్తిరించే చురకత్తుల విన్యాసం
Preview download free pdf of this Telugu book is available at Fluorosis Fluorosis
Login to add a comment
Subscribe to latest comments
