-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఫెర్మా చివరి సిద్ధాంతం (free)
Fermat Chivari Siddhantam - free
Author: Vemuri Venkateswara Rao
Pages: 106Language: Telugu
ఆ మధ్య ఈమాట సంపాదకుడు శ్రీ మాధవ్ మాచవరం “ఫెర్మా చివరి సిద్ధాంతం మీద ఒక వ్యాసం రాయరాదూ?” అంటూ ఒక విద్యుల్లేఖ పంపేరు. “ఇటువంటి పనులు చేసే సామర్ధ్యం నాలో లేదు. నన్ను ఇబ్బంది పెట్టకండి” అంటూ తిరుగు టపా పంపేను.
ఉత్తరం అంటే గోలికి పారేసేను కాని, “నిజంగా ప్రయత్నించి చూస్తే ఎలాగుంటుందో” అన్న సందేహం నా మనస్సులో గొలకడం మొదలు పెట్టింది. ఈ సమస్యని కూలంకషంగా పరిశీలిస్తూ సైమన్ సింగ్ (Simon Singh)రాసిన “ఫెర్మాస్ లాస్ట్ థీరం” అనే పుస్తకం కొని తెప్పించేను. ముందుకి, వెనక్కి నాలుగైదు సార్లు చదివేను. అర్థం కాని చోట్ల గూగుల్ ని ఆశ్రయించేను. చదవగా, చదవగా ఒక విషయం అర్థం అయింది. ఇది నిజంగా అర్థం కావాలంటే గణితంలో ఒకటో, ఒకటిన్నరో పిహెచ్. డి. పట్టాలు ఉండాలి. కొంచెం అర్థం అయితే చాలనుకునే వారికి అకుంఠితమైన పట్టుదల ఉండాలి. సైమన్ సింగ్ కూడ ఏదో బులబులాగ్గానే వివరించేడు; లోతుకి వెళ్లలేదు.అలా సైమన్ సింగులా నేనూ బులబులాగ్గా చెప్పగలనా? అయన ఇంగ్లీషులో చెప్పేడు, నేను తెలుగులో చెప్పాలి. అయన 300 పేజీలలో చెప్పేడు. నేను ఏ 100 పేజీల లోపులోనో చెప్పాలని కోరిక; అంత కంటె పొడుగుంటే తెలుగు పాఠకులు చదవరేమో అని ఒక బెంగ.
ఈ సమస్యని ఛేదించడానికి చేసిన ప్రయత్నాల చరిత్రలో స్థూలంగా రెండు దశలు ఉన్నట్లు అనిపించింది. మొదటి దశ గురించి మొదటి భాగంలో చెప్పేను; చెబుతున్న నాకు బాగానే అర్థం అయింది కనుక చదివే మీకూ అర్థం అయేటట్లు చెప్పడానికి ప్రయత్నించేను. రెండవ భాగంలో చెప్పిన రెండవ దశ లోని లోతైన విషయాలు నిజానికి నాకే పూర్తిగా అర్థం కాలేదు. సైమన్ సింగు కూడా తనకి అర్థం అయిందని దబాయించి చెప్పలేదు. అద్భుతమైన ప్రయత్నం మాత్రం చేసేడు. నేనూ అదే ధోరణిలో ప్రయత్నం చేస్తాను. సైమన్ సింగు ఇంగ్లీషులో సాధించిన దాంట్లో పదో వంతు నేను తెలుగులో సాధించగలిగితే నా ప్రయత్నం ఫలించినట్లే!
ఇది సైమన్ సింగు రాసిన పుస్తకానికి అనువాదం కాదు. అయన సంతర్పణ కోసమని గుండిగలతో వంట చేసి వడ్డించేడు. నేను పాళ్ళు తగ్గించి, మా వంటింట్లో కుంపటి సెగ మీద, నా పైత్యం అనే పోపు వేసి, ప్రయత్నం చేస్తున్నాను. చదువరులకి ఒక హెచ్చరిక! ఎంత కాదనుకున్నా గణిత సమీకరణాలు, గణిత భావాలూ వాడకుండా ఈ అంశం ప్రస్తావించడానికి వీలు పడదు. కనుక కొంత గణితం, కొంత గణిత పరిభాష తప్పనిసరి. కనీసం ఉన్నత పాఠశాలలో నేర్పే బీజగణితం పాటి గణితంతో పరిచయం లేకపోతే కొన్ని సందర్భాలలో నేను చెప్పేది అర్థం కాదు. అప్పుడు నిరుత్సాహ పడకుండా దున్నుకుంటూ పోతే మీ శ్రమ వృధా కాదని నా నమ్మకం.
- వేమూరి వేంకటేశ్వరరావు
- FREE
- FREE
- FREE
- ₹162
- ₹162
- ₹162
The author simultaneously narrated the biographies of mathematicians interestingly on one side and also explained the theorem on the other side but he should have explained the theorem more elaborately.He couldn't explain Taniyama-Shimura conjucture clearly which is important to understand Fermat's theorem.This book is helpful to students as mere history book.Thank you