-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఫాతిమా షేక్ (free)
Fathima Shaik - free
Author: Syed Naseer Ahamed
Pages: 73Language: Telugu
‘ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు'గా ఖ్యాతిగాంచిన ఫాతిమా షేక్' గురించి రాయాలని చాలాకాలం నుండి మనస్సులో అనుకుంటూ వచ్చాను. ఆమెకు సంబంధించిన సమాచారం సేకరణకు ఆరంభించాను. గత సంవత్సరం పుస్తకం రాయడానికి ఉపక్రమించాను. ప్రతికూల అభిప్రాయాలు, సమాచార సేకరణలో ఎదురైన సంక్లిష్ట పరిస్థితుల వలన ఆ ప్రయత్నం అప్పట్లో విరమించుకున్నాను.
ఆ తరువాత 2020 ఆగస్టులో రాయాలనుకున్నాను. సమాచారం కోసం తిరిగి వెతుకులాట ఆరంభించాను. మహాత్మా జోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి పూలే మీద వెలువడిన పలు గ్రంథాలను సేకరించుకుని అన్వేషణ అధ్యయనం ఆరంభించాను. ఆశ్చర్యం ! మహాత్మా జోతిరావు ఫూలే, సావిత్రీబాయిలతో కలసి పనిచేసిన ఫాతిమా షేక్ ఆధారాల సహిత ప్రస్తావనలు పెద్దగా కన్పించలేదు. బాగా నిరాశకు గురయ్యాను.
ఆ నిరాశాజనక వాతావరణంలో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకూడదని నిర్ణయించుకుని పట్టుదలతో ముందుకు సాగాను. 'ఆధునిక భారత తొలి ముస్లిం ప్రధానోపాధ్యాయురాలు'గా కూడా ఖ్యాతిగాంచిన ఫాతిమా షేక్ గురించి నాకు లభించినంత సమాచారానికి అక్షర రూపం కల్పించి తెలుగు పాఠకులకు సమర్పించాలని అనుకున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా గూగులమ్మను ఆశ్రయించాను. మహారాష్ట్రలోని పలువురు ప్రముఖ రచయితలతో, చరిత్ర పండితులతో, చరిత్ర పరిశోధకులతో, మిత్రులతో చాలా విస్తృతంగా సంభాషించాను. ఆ విధంగా రాబట్టిన ఉర్దూ, మరాఠి గ్రంథాలు, దస్త్రాలలోని సమాచారాన్ని మహారాష్ట్రలోని వివిధ పత్రికల్లో వెలువడిన పలు వ్యాసాలను తెప్పించుకుని మిత్రుల సహకారంతో నేను ఎరిగిన తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువదించుకున్నాను. అంతర్జాలం, సామాజిక ప్రసార మాధ్యమాలను కూడా ఆశ్రయించాను. సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వచ్చి చేరిన పలు వ్యాసాలను, ప్రసారానికి నోచుకున్న పలు వీడియోలను సేకరించుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఆ విధంగా సమకూర్చుకున్న సమాచారంతో ఫాతిమా షేక్ మీద ఈ పుస్తకాన్ని నాలుగు మాసాల కాలంలో (అక్టోబర్ 2020 - జనవరి 2021) రూపొందించాను.
- సయ్యద్ నశీర్ అహమ్మద్

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE