-
-
ఫాహియాన్ భారతదేశయాత్ర - రివైజ్డ్
Fa Hien Bharatadesa Yatra Revised
Author: Sri Mokshananda
Publisher: Dharmadeepam Foundation
Pages: 96Language: Telugu
ప్రముఖ ధర్మాచార్యుడు ఫాహియాన్ క్రీ.శ. 4-5 శతాబ్దాల్లో నివసించాడు. పసివాడుగా ఉన్నప్పుడే అతడు విహారానికి పంపబడ్డాడు. ఆరంభంలో కలిగిన అనారోగ్యాన్ని అధిగమించి 'గ్రామ్యధర్మానికి, అసభ్యతకు' దూరంగా అతడు తన జీవితాన్ని ధర్మానికి అంకితం చేసుకున్నాడు. చైనాలో ముక్కలు, ముక్కలుగా అసమగ్రంగా ఉన్న అనువాదాలను చూసి ఆయన ప్రామాణికమైన వినయగ్రంథాలను తేవటానికి భారతదేశానికి పోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో చైనాలో చక్రవర్తి యావోహింగ్ ఆదేశం ప్రకారం కుమారజీవుడు మహాయాన గ్రంథాల అనువాదంలో నిమగ్నమై ఉన్నాడు. నమ్మశక్యంకాని ఈ సాహసయాత్రకు పూనుకున్నప్పుడు ఫాహియాన్ వయస్సు అరువది అయిదు సంవత్సరాలు. యాత్రను ముగించుకొని మరల అతడు తన మాతృభూమిలో కాలు పెట్టినప్పటికి అతడు డెబ్భైతొమ్మిది ఏండ్లవాడైనాడు. ఫాహియాన్ పదిహేను సుదీర్ఘ సంవత్సరాల పాటు చేసిన సమయంలో అయా భాషలను నేర్చుకున్నాడు. శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేశాడు. విలువైన గ్రంథాలను, కళాకృతులను సేకరించాడు. ముప్పది దేశాల గుండా సంచరించాడు. ఈ దేశాలన్నీ బౌద్ధధర్మాన్ని అనుసరించినవే.
తిరిగొచ్చిన తర్వాత ఫాహియాన్ భారతీయ భిక్షువు బుద్ధభద్రునితో కలసి తాను తెచ్చిన సంస్కృత గ్రంథాలను అనువదించటంలో తన శేష జీవితాన్ని గడిపాడు. అతడు తన యాత్రావివరాలను "బౌద్ధదేశాల వివరాలు - చైనా యాత్రికుడు ఫాహియాన్ యాత్రావృత్తాంతం" అనే పేరుతో వ్రాసిపెట్టాడు. ఫాహియాన్ ఎనభై ఎనిమిది సంవత్సరాల వయస్సులో చనిపోయాడు.
- సంబటూరు వీరనారాయణ రెడ్డి
