-
-
ఎక్స్ట్రా జబర్దస్త్ జోక్స్
Extra Jabardasth Jokes
Author: V.Syam Kumar
Publisher: Mohan Publications
Pages: 80Language: Telugu
మెకానిక్ : మీ ఇంట్లో ఫ్రిజ్, టీవీ, టేబుల్ ఫాన్, డివిడి అన్నీ బాగానే పనిచేస్తున్నాయి కదా?
ఆకాష్ : అవును పనిచేస్తాయి.
మెకానిక్ : ఎప్పుడూ చూసినా మీరు సీలింగ్ ఫాన్ను రిపేరుకు తీసుకు వస్తారేం?
ఆకాష్ : నా భార్య ఎప్పుడూ చచ్చిపోతానని సీలింగ్ ఫాన్కి ఉరి వేసుకుంటుంది.
* * *
శేఖర్ ఏమిరాయని పోస్ట్కార్డును పోస్ట్బాక్స్లో వేయడం చూసిన రాము - ''కార్డు మీద ఒక్క ఎడ్రస్ మాత్రమే రాసి పోస్ట్ చేశావేమిటి? ఎవరికి?'' అన్నాడు రాము.
''మరి దానిమీద ఏమీ రాయకుండ పోస్ట్ చేశావేమిటి ?'' అన్నాడు శేఖర్.
''మరి దానిమీద ఏమీ రాయకుండ పోస్ట్ చేశావేమిటి?'' అన్నాడు రాము.
''నాకు...నా భార్యకు ఈ మధ్యన మాటలు లేవు. అందుకే ఖాళీ ఉత్తరం పోస్ట్ చేశాను.''
* * *
రాజీ : నాన్నా ! మీరు చాలా అదృష్టవంతులు ఈ సంవత్సరం మీకు డఋ్బలు ఎక్కువ ఖర్చు కావు.
రమణ : ఎలా ?
రాజీ : మీరు ఈ సంవత్సరం నాకు కొత్త పుస్తకాలు కొనక్కర్లేదు.
రమణ : ఎందుకు ? ఎవరి పుస్తకాలయినా తెచ్చుకున్నావా ?
రాజీ : లేదు, నేను ఫెయిల్ అయ్యాను. మళ్ళీ అదే క్లాసు చదవాలి కదా!
* * *

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE