• Everest In Mind
  • Ebook Hide Help
    ₹ 150
    180
    16.67% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎవరెస్ట్ ఇన్ మైండ్

    Everest In Mind

    Publisher: Kasturi Vijayam

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఒకసారి రంగుల రెక్కలు తగిలించుకుని

సీతా కోక చిలుకనై 'నా' వెంట నేనే పడ్డాను

ఆకుల్లో మునిగి రామచిలుకనై

'నా' పండు నేనే తిన్నాను.

ఇదంతా నాజీవిత యాత్ర" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ ఒక కవిత చెబుతూ...

తన రెక్కలు తానే తొడుక్కుని సీతా కోక చిలుకలా "పాకల" గ్రామం నుండి ఎవరెస్ట్ శిఖరం వరకు ఎగిరిన మాలావత్ పూర్ణ యధార్థ యాత్రా కథే ఈ పుస్తకం.. " ఎవరెస్ట్ ఇన్ మైండ్ ".

పూర్ణ ఒక బంజార బాలిక. తను చిన్నప్పుడు అడవిలో తప్పిపోవడంతో ఈ కథ మొదలై ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరడంతో ముగుస్తుంది. 'ఎవరెస్టు ' ను మనసున ముద్రించుకున్న పూర్ణ జీవితంతో అడవి నుండి శిఖరం వరకూ గల ప్రస్థానాలను హృదయ మనోహరంగా అక్షరబద్ధం చేశారు రచయిత శ్రీ పామిరెడ్డి సుధీర్ రెడ్డి .

దేవీదాస్ తప్పిపోయిన తన బిడ్డను వెతుక్కుంటూ వెళ్ళి అడవిలోని ఒక చెట్టు పైకి గోచి బిగించి చిటారు కొమ్మకు ఎగబాకుతాడు. పూర్ణ సాధించే భవిష్యత్ విజయానికి ప్రారంభ సూచికగా ఆ సన్నివేశం అనిపిస్తుంది. తరతరాలుగా వింటూ వచ్చిన బంజారాల చరిత్రను పిల్లలకి కథలు కథలుగా చెబుతుంటాడు దేవిదాసు. ఈ సంధర్భాన్ని రచయిత చాలా స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. వందల యేళ్ళు బంజారా బతుకుచిత్రాన్ని హృద్యంగా ఆవిష్కరించారాయన.

శ్రీ సుధీర్ రెడ్డి తనలోని చరిత్రకారుడిని, సామాజిక వేత్తని ఎక్కడా దాచుకోని వైనం కనిపించింది. చారిత్రక విభాతసంధ్యల మానవకథా వికాసాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించారాయన. దేవీదాస్ పాత్ర రచయితకి , పూర్ణకి మధ్య వారధిలా కనిపిస్తుంది ఈ పుస్తకంలో పలుచోట్ల.

తమ ఉనికినీ, సంపదనీ పోగొట్టుకున్నా జీవన విధానాన్ని, సంస్కృతిని విడిచిపెట్టని వ్యక్తిత్వాన్ని, బంజారాల అస్థిత్వ శిల్పాన్ని అందంగా చెక్కు కుంటూ పోయారు రచయిత.

ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలపై అంటారు.. సిరి వెన్నెల సీతారామ శాస్త్రి. బిడ్డని ఉన్నత స్థాయికి ఎదగమని చెప్పి ప్రోత్సహించే వ్యక్తులుగా దేవీదాస్ , భాట్ లు కనబడతారు. కష్టమొచ్చినపుడు పచ్చని అడవి తల్లిని తల్చుకోమని చెప్పినపుడు గుండెనిండా ఊపిరి పీల్చుకుంటుంది పూర్ణ. సంక్షేమ హాస్టల్‌కి చేరిన పూర్ణ జీవితం మరో మలుపు తీసుకుంటుంది. S.R శంకరన్‌ గారి ఆశయాలను, జీవితాన్ని ఆర్తుల కోసం ధారపోసిన వైనాన్ని ఈ సందర్భం గా మన కళ్ళముందుంచారు రచయిత.

గమనిక: " ఎవరెస్ట్ ఇన్ మైండ్ " ఈబుక్ సైజు 5.7mb

Preview download free pdf of this Telugu book is available at Everest In Mind