• Entavaralaina
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎంతవారలైనా...

    Entavaralaina

    Publisher: Sahitya Sourabham

    Pages: 123
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాలమిస్ట్‌గా, వ్యాసకర్తగా, ఆకాశవాణిలో కథలు ప్రసంగాలు వినిపించే రచయిత్రిగా ఉంగుటూరి శ్రీలక్ష్మి తెలుగు పాఠకులకు, శ్రోతలకు చిరపరిచితురాలు. నగిషీలు, అలంకరణలు, వర్ణనలు లేకుండా సూటిగా కథ చెప్పడం శ్రీలక్ష్మి రచనా శైలి. కథనంలోని సహజత్వం వల్ల మంచి రీడబిలిటీ వుంది.

సవాలక్ష పనుల మధ్య సవాళ్ళ నెదుర్కొంటూ చిరునవ్వుతో జీవితాన్ని ప్రేమించ గలగడం ఒక తపస్సాధన, అటువంటి సాధకురాలు శ్రీలక్ష్మి. మధ్యతరగతి మందహాసాలు, విషాద జీరలు, గాఢానుబంధాలు, వినూత్న అనుభవాలు, అనుభూతులు, తరాల అంతరాల జీవన సరళిలోని తమాషాలు, సరదాలు, సీరియస్సులు ఒకటేమిటి మాట, ఆట, పాట అన్నీ కథా వస్తువులే. అందుకే ఏ కథ చదివినా పఠితలు అది తమ ఇంటి కథేనేమో! అని ఐడెంటిటీ ఫీలవుతారు.

24 కథల ఈ సంపుటిలో ఒక 'మైత్రి' పాత్ర ప్రధానంగా ఆకట్టుకుంటుంది. 'How to Win Friends and Influence People' అన్న వాక్యానికి సమా ధానంగా నిలుస్తాయి ఈ కథలు.

మాట్లాడ్డం, ఎదుటి వారితో సంభాషణ ప్రారంభించడం కొనసాగించడం ఒక కళ. ఆ కళలో నిష్ణాతురాలైన ఉంగుటూరి చవులూరించే వ్యాసాలకే 'మాటల పందిరి' వేశారు. ఆ కుదురైన మాటల పందిరిపై చక్కగా చిక్కగా అల్లుకున్న లతాలతలే ఈ కథా కుసుమాలు. చిన్న కథకు అచ్చమైన నిర్వచనాలు.

కథలన్నీ ఒక మంచి స్నేహితురాలితో సంభాషించినట్లుంటాయి. వాటిలోని పాత్రలు మనతో మంచి చెడ్డా మాట్లాడి మమతాను బంధాలు నేర్పిస్తాయి. మంచి పఠనీయత ఈ సంపుటి ప్రత్యేకత. ఆత్మీయతా అను బంధాలకు అర్థాలు మారిపోతున్న నేటి బతుకు చిత్రానికి నీటిరంగులద్ది నూతన భాష్యం చెబుతూ 'ఫ్యామిలీ ఫాన్సీ'ని పెంచే కథలు రాసిన మంచి మనసున్న కథకురాలు ఉంగుటూరి శ్రీలక్ష్మిని మనసారా అభినందిస్తున్నాను.

- కె.బి. లక్ష్మి

Preview download free pdf of this Telugu book is available at Entavaralaina