-
-
ఎంతదూరమీ రాత్రి
Entaduramee Ratri
Author: P. S. Narayana
Pages: 94Language: Telugu
ఋషి తలెత్తి చికాగ్గా రుక్మిణి ముఖంలోకి చూశాడు.
"ఒసేయ్ రౌడీ... నువ్వు కాసేపు నోర్మూసుకో... పోయిరా తమ్ముడూ!" అన్నది.
"చిత్తం రుక్మిణీదేవిగారు... నేను నోర్మూసుకుంటున్నాను".
ఋషి రాధను అనుసరించక తప్పలేదు. ఇద్దరూ గేటు దాటారు. రెండు వీధులు దాటారు. మెయిన్ రోడ్డులో ఆర్టీసీ బస్టాపు వైపుకు నడుస్తున్నారు.
"చూశారా! మనం ఏదైతే జరగకూడదనుకుంటామో అదే మనని వెంటాడుతుంటుంది.. నా నుండి మీరు దూరంగా తప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు... కాని పరిస్థితులు అందుకు వ్యతిరేకిస్తున్నాయి.... అవునా! అవునూ... ఇంతకీ ఆ రాత్రి నన్ను ఆటోలో మీ రూంకి తీసుకువెళ్ళే ప్రయత్నంలో నన్నో ప్రశ్న వేశారు... దానికి సమాధానంగా నేనూ ఓ ప్రశ్న వేసి, సమాధానంతో మరునాడు ఆబిడ్స్కు రమ్మనమన్నాను మిమ్మల్ని... రానేలేదేం!" అన్నది తలెత్తి అతని కళ్ళలోకి నవ్వుతూ చూస్తూ.
"రావాలనిపించలేదు!"
"ఉఁహూఁ.. నా ప్రశ్నకు మీకు సమాధానం దొరకలేదు!" అన్నది ఎగతాళిగా.
ఋషి కప్పదాటు వేస్తున్నట్లుగా, "మీరు రుక్మిణీ క్లాస్మేట్స్ అన్నారు గదూ!"
రాధ, నేనూ అందను అన్నట్లుగా, "ఇలా మీతో - మీరు అసహ్యించుకున్నా సరే - సనత్నగర్ వరకూ మాట్లాడుతూ నడవాలనిపిస్తోంది!" అన్నది నవ్వి.
