-
-
ఇంగ్లీషు కీకారణ్యంలోకి ప్రవేశించండి!
Englishu Keekaranyamloki Pravesinchandi
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 361Language: Telugu
ఇంగ్లీషు కీకారణ్యంలోకి....
ప్రతీ పరాయిభాషా ఒక కీకారణ్యమే, చిన్నదో పెద్దదో! ఆ కీకారణ్యంలోకి ప్రవేశించే ఏకైక మార్గం, దాని నియమాల్ని నేర్చుకుంటూ వెళ్ళడమే. ఆ నియమాల్ని, మాతృభాషలో వుండే నియమాలతో పోల్చుకుంటూ కూడా వెళ్ళాలి. భాషని నేర్చుకోవటానికి దాని వ్యాకరణంతో సంబంధం లేని సులువైన మార్గాలేవి వుండవు. అలాంటి 'కిటుకు'లేవో వుంటాయని ఎన్నడూ భ్రమ పడకూడదు. భాషని నేర్చుకోవాలని నిజంగా కోరిక వుంటే, దాని వ్యాకరణం మీద కూడా ఇష్టం కలుగుతుంది. అయితే, వ్యాకరణ నియమాలు తెలుసుకోగానే ఆ భాషని అనర్గళంగా మాట్లాడగలమని అర్థం కాదు. వ్యాకరణం అనేది భాషలోకి ప్రవేశించడానికి సాధనం మాత్రమే. ఇక మిగిలినదంతా తర్వాత జరిగే కృషిమీదే ఆధారపడి ఉంటుంది.
కానీ, వ్యాకరణ నియమాలు తెలియడంవల్ల వెంటనే జరిగే మేలు ఏమిటంటే, ఇంగ్లీషు పుస్తకాలు చదివితే అర్థమవుతూ వుంటాయి. 'ఇంగ్లీషు పుస్తకాలు' అంటే, విద్యార్థుల స్థాయికి తగిన పుస్తకాలు. అంటే, విద్యార్థులు చదివే ఇంగ్లీషు పాఠాలు. అంతకుముందు అర్థంకాని వాక్యాలు, అక్కడవున్న నియమాలు తెలిసినప్పుడు ఎంతో తేలికగా అర్థమవుతాయి. అప్పుడు, ఆ భాష అంటే భయం పోతుంది. పైగా, కొత్త భాషని అర్థం చేసుకోగలుగుతున్నామనే ధైర్యం, సంతోషం ప్రారంభమవుతాయి. క్రమంగా అ భాషలోకి ప్రవేశం జరిగిపోతుంది.
ఒక పరాయిభాష పట్టుపడిందంటే, ఆ భాషలో నియమాలు నేర్చుకుంటేనే అది జరుగుతుంది. లేకపోతే, అది ఎవ్వరికీ, ఎప్పటికీ, సాధ్యం కాదు. కాబట్టి, ఒక భాష నేర్చుకోదల్చినవాళ్ళు మొట్టమొదట తెలుసుకోవలసింది 'దాని వ్యాకరణం జోలికి పోకుండా అది సాధ్యం కాదు' అని. ఈ సంగతి సరిగా అర్థం చేసుకుంటేనే భాషలు నేర్చుకోడం గురించి పొరపాటు అభిప్రాయాలన్నీ వదులుకుంటారు. ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నారో దాని వ్యాకరణం నేర్చుకోవటానికి తమని తాము సిధ్ధం చేసుకుంటారు.
ఈ పుస్తకం రచయితలకు ఒక గొప్ప ఊపునిచ్చింది.తెలుగులో ఈ పుస్తకం లో100% ఆంగ్ల వ్యాకరణాన్ని వివరించారు ...మాతృభాషలో విద్యాభ్యాసం అంటే కొంతకాలం క్రితం మేధావులకు చిన్న చూపు ఉండేది...కొంతకాలానికి మనకు మంచి రచయితలు తయారయ్యారు. మాతృభాష విలువ అందరికీ తెలిసింది..అన్నీ తెలుగులో వివరించడం సాధ్యం అని నిరూపించారు.. ఈ పుస్తకం రచయితలకు అనువాదకులకు కొత్తగా ఆంగ్ల భాష నేర్చుకోనేవారికి చాలా బాగా పనికివస్తుంది...అన్ని వయసులవారికి ఈ పుస్తకం గొప్ప ఆయుధం
కినిగె బృందానికి నమస్కారం. "ఇంగ్లీషు కీకారణ్యంలోకి" చాలా ఉపయోగకరమైన పుస్తకం. మేము ఎన్నో పుస్తకాలు కొని రిషీవ్యాలీ చుట్టుప్రక్కల పల్లె పిల్లలకు బహుమతిగా ఇచ్చాము. ఇంకా ఇస్తున్నాము. గవర్నమెంట్ హైస్కూళ్ళ పిల్లలకి ప్రతి ఒక్కరికీ ఉచితంగా ప్రభుత్వం అందివ్వవలసిన పుస్తకం.
ధన్యవాదాలు
రాధ
we need this kind of books and people always likes to read the books that create no confusions and no controversies in society. Appreciate.
Good
This book shall of help to those who wish to learn English. Those who wish to learn English may not be knowing how to use PDF or have access to read book electronically. It would be better if you sell the print version.