-
-
ఇంగ్లీషు మాట్లాడుకుందాం రండి!
English Matladukundam Randi
Author: C. V. S. Raju
Publisher: Victory Publishers
Pages: 334Language: Telugu
"లాంగ్వేజ్ లెర్నింగ్ సిరీస్"లో భాగంగా విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ ప్రచురించిన పుస్తకం "ఇంగ్లీషు మాట్లాడుకుందాం రండి!".
* * *
చక్కగా మాట్లాడడం ఒక కళ. అది ఏ భాషలోనైనా సరే. మన మాతృభాషలో ఎంత సహజంగా, ధారాళంగా మాట్లాడుతామో, ఇంగ్లీషులో కూడా అంత సహజంగా మాట్లాడాలి.
ఎన్ని డిగ్రీలు ప్యాసయినా, ఇంగ్లీషులో మాట్లాడలేకపోవడానికి కారణాలు రెండు. ఒకటి బెరుకుదనం. అంటే మాట్లాడగలనా లేదా అనే సందేహం రావడం. రెండో - మాట్లాడితే తప్పులు దొర్లుతాయేమోనని అసలు మాట్లాడకుండా ఉండడం.
ఇంగ్లీషులో రాయడం కంటే మాట్లాడడం ఎక్కువ కష్టం. ఈ పుస్తకంలో మర్యాదగా పలకరించడం ఎలా? ఒక్కొక్క సందర్భంలో ఎలా మాట్లాడాలి? ఎలా ప్రశ్నించాలి? ఎలా సమాధానాలు చెప్పాలి? మొదలైన విషయాలన్నీ అభ్యాసాలతో సహా ఇవ్వబడ్డాయి. ప్రతి విషయం మీద మాట్లాడేడప్పుడు ఏయే పదాలు అవసరమో అన్నీ ఇవ్వడం జరిగింది. విషయ పరిచయాలైన తరువాత Situational Conversations ఇవ్వబడ్డాయి. Exercises కి key చివర్లో ఇవ్వడం జరిగింది. వీటిని శ్రద్ధగా చదివి, ఇంగ్లీషులో మీరు ధారాళంగా మాట్లాడగలుగుతారని ఆశిస్తూ -
- రచయిత
