-
-
ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోండి !
English Grammar Nerchukondi
Author: V. G. Bhavani
Publisher: Sree Madhulatha Publications
Pages: 128Language: Telugu, English
ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత నానాటికీ ప్రపంచ దేశాలన్నింటిలో బాగా పెరిగిపోతోంది. అందుకు కారణం- ముఖ్యంగా విద్యావిధానాలలో ఎన్నో గణనీయమైన మార్పులు రావడం. ఏ రంగానికి సంబంధించిన అంశమైనా చర్చించాలన్నా, బోధించాలన్నా - అది అందరికీ అర్థం కావాలంటే ఇంగ్లీష్లోనే సాధ్యం అవుతుంది.
ఇంగ్లీష్ భాష చాలా కష్టం, అదొక మహాసముద్రం వంటిదని చాలామంది - అపోహపడుతుంటారు. బాగా అర్థం చేసుకోగలిగితే - ఇంగ్లీష్ అంత సులువైన భాష మరొకటిలేదు.
ఇంగ్లీష్ అక్షరాలు కేవలం ఇరవై ఆరు మాత్రమే. భాషకు అవసరమైన వ్యాకరణ సూత్రాలు - భాషాభాగాలు చాలా క్లుప్తంగా భాషను వివరించేవి. వాటిని సునిశితంగా సాధనచేస్తే - ఇంగ్లీష్ భాషను ఎవరైనా నేర్చుకోవచ్చును.
ఏ భాషలోనైనా గ్రామర్లేకుండా ఒక్క వాక్యం మాట్లాడలేము - ఒక్క విషయం వ్రాయలేము. కాబట్టి - ఏ భాషకైనా వ్యాకరణ విశేషాల్ని తెలుసుకోవాలి.
ఈ పుస్తకంలో - ఇంగ్లీషు భాషా భాగాలను పూర్తిగా వివరిస్తూ – మనం నిత్యజీవితంలో మట్లాడటానికి గానీ, వ్రాయడానికి గానీ, ఉపయోగించే వ్యాకరణాన్ని చేర్చి వివరించడం జరిగింది.
- పబ్లిషర్స్
