-
-
ఎల్లమ్మ రంగాపురం గ్రామ చరిత్ర
Ellamma Rangapuram Grama Charithra
Author: G. Yadagiri
Publisher: Swechcha Prachuranalu
Language: Telugu
రాయాల్సినంత చరిత్ర రంగాపురం గ్రామానికి ఉందా? అంటే ......... ఉందనే చెప్పాల్సివస్తుంది. ఎలాగంటే!
★ తెలంగాణ పౌరుషాగ్ని కాకతీయుల పరిపాలనా కాలంలో 800 సంవత్సరాలనాడు నిర్మించిన చారిత్రాత్మకమైన ఎల్లమ్మ గుడి ఇక్కడి పాతవూరిలో ఉంది.
★ 400 సంవత్సరాల నాడు గ్రామపునర్నిర్మాణ సందర్భంలో గున్న దొరల హయాంలో ఏ గ్రామానికీ లేని విధంగా గ్రామరక్షణకు చుట్టూ కోట, బురుజులూ కట్టబడ్డాయి.
★ క్రీ.శ 1869 సం॥ ప్రాంతంలో ఈ గ్రామం తాలూకాగా నాగర్ కర్నూల్ జిల్లాలో వెలిగింది.
★ వంద సంవత్సరాలనాడే గ్రామంలో సాహిత్య సృష్టి జరిగి, నేటికి వివిధ ప్రక్రియల్లో రచనలు చేసిన 14 మంది కవులు, రచయితలు ఈ గ్రామంలో వున్నారు.
★ తెలంగాణాలో, సీమాంధ్రల్లో ఏ వూళ్ళోనూ లేనన్ని గ్రామదేవతలు, దేవాలయాలు ఇక్కడ వెలిశాయి.
★ 60 సంవత్సరాలనాడు (క్రీ.శ 1951) ‘బాలవాణి’ గ్రంథాలయాన్ని ఇక్కడ స్థాపించారు.
★ నైజాం నిరంకుశ పాలనను ఎదిరించి జైలు పాలై, ‘నాతెలంగాణ కోటి రత్నాలవీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి డా॥ దాశరథి కృష్ణమాచార్యులు ఈ వూరి అల్లుడు.
★ 1969 సం॥ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మొదటి కవితా సంకలనం ‘జై తెలంగాణ విప్లవ ఢంకా’ ఈ గ్రామానిదే.
★ 55 సంవత్సరాల క్రితమే ఇక్కడ గ్రామస్థులు రంగస్థల నాటకాలు ప్రదర్శించారు.
ఎక్కడా లేని విధంగా ఏడు సంవత్సరాలకొకమారు ఏడు రోజులు ఎల్లమ్మ పండుగను ఇక్కడ కొప్పునూరు కురువలు వైభవంగా జరుపుతారు.
★ తెలంగాణాకే సొంతమైన, అరుదైన, ప్రాచీన జానపదకళ ‘ఒగ్గుకథ’ ఇక్కడ నేటికీ ప్రదర్శింపబడుతూ సజీవంగా వుంది.
★ ఈ వూరి జనం నేటికీ కులమతాల పట్టింపు లేకుండా, రాజకీయకక్షలు లేకుండా పరస్పరం సామరస్య శాంతియుత సహజీవనం సాగిస్తున్నారు.
ఇలా అనేక ప్రత్యేకతలున్న ఎల్లమ్మ రంగాపురం గ్రామ చరిత్రను అక్షర బద్ధం చేసి, భావితరాలకు అందించాల్సిన అగత్యం, బాధ్యత మనమీద ఉంది. అదే ఈ చరిత్ర రచనాలక్ష్యం !
ఈ పుస్తకం ఒక ప్రాంతపు micro history ని నమోదు చేసింది. ఇలాంటి స్థల పురాణాలు ఇంకా రావాలి. ఆ ప్రాంతం గురించి అసక్తి ఉన్నవారికి ఎంతో కొంత అదనపు సమాచారం అందిస్తాయి ఇలాంటి గ్రంధాలు. కినిగె లో ఇంకా ఇలాంతి పుస్తకాలున్నవి. తరచి చూడండి.