• Eliyaneshan Parichaya Prasangam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎలియనేషన్ పరిచయ ప్రసంగం (free)

    Eliyaneshan Parichaya Prasangam - free

    Author:

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేశంలో నేడు సామాన్య ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు పెట్టుబడిదారీ వ్యవస్థ కారణమని, దాన్ని సమూలంగా మార్చాలనే లక్ష్యంతో వామపక్షవాదులు పనిచేస్తుంటారు. పెట్టుబడిదారీ వ్యవస్థను సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడే ఈ మార్పు సాధ్యపడుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి మార్క్స్ రచనల అధ్యయనం ఎంతో అవసరం. అయితే కొన్ని మార్క్స్ ఒరిజినల్ భావనలు విస్తృత ప్రచారంలోకి రాలేదు. చాలా మందికి అందుబాటులో లేవు. ముఖ్యంగా తెలుగు భాషలో అసలు లేవు. అటువంటి మార్క్సిస్టు భావనలలో 'ఎలియనేషన్' చాలా ముఖ్యమైనది.

ఎలియనేషన్ భావనకు మార్క్స్ సిద్దాంతాలలో చాలా ప్రాధాన్యం ఉంది. మనిషి తన స్వభావం నుండి వేరుపడి పోవడమే ఎలియనేషన్ అని, సమాజం యొక్క విప్లవం యొక్క అంతిమ లక్ష్యం ఎలియనేషన్‌ను అధిగమించడమే అని మార్క్స్ భావన. ఎలియనేషన్ భావనకు మార్క్సిస్టు సాహిత్యంలో రావలసినంత ప్రాముఖ్యత రాలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సోవియట్ యూనియన్‌లో ప్రచురించిన మార్క్సిస్టు సాహిత్యంలో దీనికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో అనేకమంది మార్క్సిస్టు మేధావులు ఎలియనేషన్ భావన ప్రాధాన్యతను గుర్తించి దాని గురించి రచనలు చేశారు. అయితే ఇవేవీ తెలుగులో అందుబాటులో లేవు. ఈ లోపాలను గుర్తించి ఎలియనేషన్‌పైన శ్రీ రావు కృష్ణారావు తెలుగులో పుస్తకం రచించడం, దాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకాన్ని పరిచయం చేయవలసిందిగా 'వేదిక : డిస్కార్ట్ సర్వర్' నిర్వాహకులు కోరగా శ్రీ రావు కృష్ణారావు దానిపై ఉపన్యసించారు.

ఎలియనేషన్ సంక్లిష్టమైన భావన. దీనిని సరళమైన భాషలో చెప్పడం చాలా కష్టం. అయినప్పటికీ, శ్రీ రావు కృష్ణారావు తన ఉపన్యాసంలో ఎలియనేషన్ భావనను చాలా చక్కగా, సరళమైన భాషలో సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా పరిచయం చేశారు. దీనిపై తరువాత జరిగిన 'చర్చ', 'ప్రశ్న-జవాబులు' ఈ అంశంపై మరింత స్పష్టత చేకూర్చాయి. అది విన్న తర్వాత ఈ ఉపన్యాసాన్ని పుస్తక రూపంలో తీసుకువస్తే 'ఎలియనేషన్' పుస్తకానికి పరిచయంగాను, ఈ భావనను సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ భావించడం జరిగింది. మా కోరికను మన్నించి ఉపన్యాసాన్ని పుస్తకరూపంలో ప్రచురించడానికి అనుమతించిన శ్రీ రావు కృష్ణారావుగారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మార్క్సిస్ట్ సిద్ధాంత రచనలు చదివి అర్థం చేసుకోవడంలోను, వాటిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడంలోను, వామపక్ష వాదులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను.

- చెలికాని స్టాలిన్