-
-
ఎక్కడినుంచి ...ఇక్కడి దాకా
Ekkadinunchi Ikkadidaakaa
Author: Sripada Swatee
Publisher: Self Published on Kinige
Pages: 55Language: Telugu
Description
ఆత్మగౌరవం! మాటను ఇంత దారుణంగా హత్య చెయ్యడం అంటే ఇదేనేమో!
ఇంత దారుణంగా అవమానించాలా, ఏదో ఒక ఉద్యోగం చెయ్యగలిగే నేను నూట పదహారు రూపాయలు తిరిగి ఇవ్వలేననుకున్నాడా.
ఇలాంటి బ్రతుకులు ఎవరికోసం? పరాన్నజీవుల్లా ఎవరిమీదో ఒకరిమీద ఆధారపడి...
నేనెవరికీ తలవంచి దాసోహమంటూ పనిచెయ్యనని మొండికేసే తండ్రికి ఇలా ఎవరిదగ్గరినుంచో అప్పనంగా డబ్బు తీసుకుని ఖర్చుపెట్టడం మాత్రం అవమానకరం కాదా?
కళ్లనిండా నీళ్ళు. నిండు నదుల్లా తొణికితే జలపాతాలై కిందకు జారేలా... అయినా చాలా ప్రయత్నం మీద కళ్ళలో నీళ్ళు కళ్ళలోనే అణిచేసుకుని ఎంత మాములుగా ఉండాలని ప్రయత్నించినా వాడిపోయిన మొహం, ఎవరో తీసిన గ్రూప్ ఫొటోలో కళ్ళనిండా కనిపించే నీళ్ళే సాక్ష్యంగా నిలిచాయి.
గాయపడ్డ మనసుతో ఆ రోజున మార్చుకున్న నిర్ణయం జీవితాన్ని పెద్ద మలుపుతిప్పింది.
Preview download free pdf of this Telugu book is available at Ekkadinunchi Ikkadidaakaa
Login to add a comment
Subscribe to latest comments
