-
-
ఏక వ్యక్తి సైన్యం
Eka Vyakti Sainyam
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 302Language: Telugu
''నేను నిరాశ పడిపోవడం లేదు సార్.... కర్తవ్యం తెలియడం లేదు. మనసు కసితో భగ భగమని మండిపోతోంది. ఆ రజనీకాంత్‌ను కల్సుకోవాలి.... ద్రోహానికి అసలు కారణం కనుక్కోవాలి.... ప్రతీకారం తీర్చుకోవాలి.''
''నీ పాయింట్ ఇప్పుడు నాకు అర్ధమైంది కార్తికేయ.... నీ మనసు పగను కోరుకుంటున్న కారణంగా, నువ్వేమీ చెయ్యలేక పోతున్నావ్.... నీ ప్రతీకారాన్ని మరచిపొమ్మని, నేననడం లేదు. ఏ గమ్యం కోసం నువ్వు బయలుదేరావో, ఆ గమ్యాన్ని మర్చిపోవద్దనే నా సలహా.''
''సార్....''
''అవును కార్తికేయా.... తాత్కాలికమైన గెలుపు కోసం అడ్డదారులు తొక్కేవారు పైకి రాలేరు. శాశ్వతమైన విజయం కోసం కృషిచేసే వారు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు.
ప్రస్తుతం తన గెలుపును నిరూపించుకోవడం కోసమే మనీష ప్రయత్ని స్తోందనుకుంటే, అది ఆమెకు ఓటమి మాత్రమే అవుతుంది. నిర్దేశిత లక్ష్యాన్ని, చేజిక్కించుకోడానికి, సంయమనం చాలా అవసరం కార్తికేయా.... దేవుడు చేసే ఆలస్యం దేవుడి నిరాదరణ కాదు.
మనీష, మీ మధ్య నడుస్తున్న ఛాలెంజ్ ఆకస్మిక పరిణామం మాత్రమే.... ఆ ఛాలెంజ్‌లో నువ్వు నిన్ను నిరూపించుకున్నావనుకో-
అది నువెక్కిన తొలిమెట్టు మాత్రమే అవుతుంది. నువ్విక్కడ మనీష అనే మనిషిని తెల్సి మాత్రమే ఓడిస్తున్నావు. కానీ.... తెలియని శక్తుల్ని నువ్వు ఓడించాలంటే దానికి జవాబుగా నీ విజయం మాత్రమే నిలుస్తుందని గుర్తుపెట్టుకో.
Climax would have been better
Concept is known, similar to "Dabbu to the power of dabbu", ok novel. Weak climax.