• Ek Tara
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏక్ తార

    Ek Tara

    Publisher: V. C. Publications

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనం రోడ్డుపై నడుస్తుంటే ఎన్నో మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని నిరుపయోగం కాబట్టి పెరిగి నశిస్తూనే ఉంటాయి. మరికొన్ని అందరికీ ఆధారమై ఎన్నో శతాబ్దాలు వటవృక్షాలుగా నిలిచిపోతాయి. కొన్ని పుట్టి నెల తిరిగే సరికి కనుమరుగయ్యేవి, మరి కొన్ని ఒక వసంతమయ్యాక నేలకూలేవి ఇలా మొలుస్తుంటాయి. కాని ఆ మొక్కల్లోంచి ఎక్కడి నుంచో మల్లెల పరిమళం అలవోకగా మనకు తాకొచ్చు. అది కలకాలం నిలిచిపోయే సౌగంధికా పుష్పవనం కావొచ్చు. అటువంటివే ఎన్నో కవితా ప్రక్రియలు కూడా. అలాంటి కవిత్వ పరిమళాల పొదరిల్లే ఆనతి కాలంలోనే ఎంతో మందిని కవులుగా తీర్చి దిద్దగలిగే ఏకైక ప్రక్రియ అయిన ‘ఏక వాక్య కవితా ప్రక్రియ…ఏక్ తార’.

- పద్మా శ్రీరామ్

గతాన్ని స్మరిస్తూ... వర్తమానాన్ని అనుసరిస్తూ... భవిష్యత్తుకు దశ-దిశ నిర్దేశించగల వారు "కవులు". మానవ జీవన వికాసానికి... సమాజ పురోభివృద్ధికి ప్రధానమైన భావ వ్యక్తీకరణకు దోహదపడేది "సాహిత్యం". తెలుగు సాహిత్యంలో సామాజిక మాధ్యమాలలో (ముఖ పుస్తకంలో) పరిచయం అక్కరలేని ముప్పె ఐదుగురు కవులు "మనిషే" కేంద్రంగా సహృదయ రసజ్ఞలను/పాఠకులను పరవశింపజేసే విధంగా, సందేశాత్మకంగా, ఆత్మానుభూతితో వెలువరించినవి "ఏకవాక్య కవితలు".

ఒక వైపు మానవత్వమనే మబ్బుల చాటున దాగిన చంద్రుడి వోలే ఉంటూనే... తమలోని భావాలకు అనుభవాలను రంగరిస్తూ... తమ తమ వృత్తులలో విరామమెరుగక పరిశ్రమిస్తూనే మరోవైపు సాహితీగగనంలో సూర్యుడివలె ప్రకాశిస్తూ... తమకంటూ ఒక ప్రత్యేకశైలిని, అస్థిత్వాన్ని స్థిరపరచుకున్న ముప్పె ఐదు కలాల సంకలనం... "ఏక్ తార" భావ కవితా"ధార"లు.

- పొట్లూరి హరికృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Ek Tara