• Egaralsina Samayam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎగరాల్సిన సమయం

    Egaralsina Samayam

    Pages: 187
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేటి కాలానికి ఒక్కడు దొరికాడు; అమితమయిన జ్ఞాన దాహంతో తపించిపోయేవాడు; మహా కవిత్వ ప్రేమికుడు; కవిత్వాన్ని జీవనవిధానం చేసుకునే సూచనలు పుష్కలంగా ఉన్నవాడు; ఏదో వ్యాసం చదివేటప్పుడు తారసపడిన 'పుస్తకం పేరును' బట్టి; ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో, సంపాయించి చదివిందాకా నిద్రపోనివాడు; తిలక్ అన్నట్టు కలల పట్టుకుచ్చులు ధరించి తిరిగేవాడు - ఒక కవిత్వ తమకంతో, మోహంతో, తనివితీరని తనంతో నిత్యాన్వేషణలో ఉన్నవాడు - తేనె నిండుగా ఉండి, జవజవలాడుతున్న తేనెతుట్టెలాంటివాడు - 'వీడు కవిగదా, కనలిపోయే వాడి కళ్ళు చూడండి - సమస్త జ్ఞానాన్ని పుడిసిలిబట్టాలనే ఆరాటం కనబడుతుంది. నడుస్తున్న కవితలా కనపడేవాడు' - వాడు బాలసుధాకర్ మౌళి అనే ఉత్తరాంధ్ర కవి.

- శివారెడ్డి

* * *

బాలసుధాకర్ కేవలం కవి మాత్రమే అయి వుంటే, అతనికి నైరూప్యత చాలా అవసరమయ్యేది. కవి మాత్రమే కాకుండా, భవిష్యత్తుని రోజూ కళ్ళారా చూస్తూ వుండే ఉపాధ్యాయుడు కూడా అవడం వల్ల అతని నైరూప్య వూహలూ, కవిసమయాలూ రోజూ కొంత కొంత విచ్ఛిన్నమైపోతూ వుంటాయి. తరగతి గది అతని సమయసందర్భాల్ని redefine చేస్తూ వుంటుంది. అతని బలాల్నీ, బలహీనతల్నీ రోజూ కొంత కొంత ఎండగడుతూ వుంటుంది.అతను గతమ్మీద బతికే వీలు లేకుండా భవిష్యత్తుని దర్శించి తీరాల్సిన చరిత్రభారాన్ని అతని మీద పెడుతూ వుంటుంది. ఆ భారాన్ని మోసుకుంటూ ఎలా కలల్లోకి ఎగురుతున్నాడన్నదే బాలసుధాకర్ కవిత్వ ప్రయాణం.

- అఫ్సర్‌

Preview download free pdf of this Telugu book is available at Egaralsina Samayam