• Eesuromani Chaduvulunte
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఈసురోమని చదువులుంటే....!

    Eesuromani Chaduvulunte

    Author:

    Pages: 74
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవాళ మన దేశంలో విద్యావిధానం లోపభూయిష్టంగా ఉంది. పాఠాలు బట్టీబట్టి మార్కులు తెచ్చుకోవడమే ప్రతిభగా చలామణి అవుతోంది. విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తోన్నా నాణ్యమైన విద్య అందడం లేదు. ఈ నేపథ్యంలో 'ఈసురోమని చదువులుంటే దేశమేగతి బాగుపడునోయ్' మొదలైన వ్యాసాలు, కొన్ని కథలు ఒక పుస్తకంగా సంపుటీకరించారు పత్తి సుమతిగారు.

మనిషి మనిషిగా మనుగడ సాగించే విద్య కావాలి. నేటి యువతలో కనిపిస్తున్న అరాచకత్వం, అమానవీయ ధోరణులను అంతంచేసే వ్యక్తిత్వ అధ్యయనాంశం కావాలి. సుమతి గారు గురజాడ నుంచీ, శ్రీశ్రీ నుంచి, వివేకానందుడువి ఆణిముత్యాల వంటి మాటలను గుదిగుచ్చి వ్యాసాలకు అందం చేకూర్చారు.

సుమతిగారి కథల్లో కూడా యువతలోని విచ్చలవిడిత్నం, మూఢనమ్మకాలకు బలైపోతున్న గ్రామీణ జనం, మేనరికాల వల్ల అనర్థాలు దర్శనమిస్తాయి. కథ కథ కోసం గాక, తాను చెప్పదలచుకున్న సందేశం కళాత్మకంగా వివరించేందుకే ఈమె కథాప్రక్రియను ఎన్నుకున్నారు.

సరళమైన భాషలో అడుగడుగునా చెబుతున్న విషయానికి ఉపబలకంగా మంచి దృష్టాంతాలతో అవసరమైన చోట్ల కవితాత్మకమైన శైలిలో రూపుదిద్దుకున్న ఈ పుస్తకం పాఠకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.

- డా. డి. వి. సూర్యారావు

Preview download free pdf of this Telugu book is available at Eesuromani Chaduvulunte