• Ee Premalinte
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఈ ప్రేమలింతే...

    Ee Premalinte

    Author:

    Pages: 84
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

జి.సుబ్బలక్ష్మిగారి కథలు చదువుతుంటే చాలా సరదాగా హాయిగా వుంటుంది. ఎక్కడో జరిగిన కథ ఎవరో చెప్తున్నట్లు వుండదు. మన కళ్ళముందు దృశ్యమానంగా అలరించి ఆనందం కలిగిస్తుంది కథ.

నాకు అర్ధమైనంతవరకు ఆమె హాస్యం వ్రాయడానికి చూపించే ఉత్సాహం చాలా అరుదైనది. కథ రాయడం అనగానే ఏదో పెద్ద సమస్య తీసుకుని, సీరియస్‌గా ముఖం పెట్టి, సమస్యలు, కష్టాలు, పరిష్కారాలు చెప్పడం సూక్తులు చెప్తూ అంతా మంచితనంతో కథ సాగిపోయేలా రాయడం మరోరకం - ఇవన్నీ బాగుండవని నేను అననుగానీ, ఎల్లవేళలా ఆస్వాదించలేమేమో అనిపిస్తుంది. మన చుట్టూ తిరిగే మనుష్యులతో, మన ఎదుటే జరుగుతున్న సంఘటనలతో అందులోంచి పుట్టుకొచ్చే హాస్యం మనసుకి ఎంతో హాయిగా, ఊరటగా ఉంటుందనిపిస్తుంది.

నిజానికి మన తెలుగు సాహిత్యంలో హాస్యరసానికి ఇవ్వవలసినంత గౌరవ మర్యాదలు దక్కలేదనిపిస్తుంది. నేను తప్పు కావచ్చు కానీ నాకనిపించినదది.

సుబ్బలక్ష్మి గారి చిత్రగుప్తుడి చిట్టాలో తికమకలు, ఒక ఇల్లాలి కథ లాంటివి ఆమె రచనా సామర్థ్యానికి గీటురాళ్ళు. ఆమెకి ఎన్నో కథలపోటీలో బహుమతులు వరించి వచ్చాయి.

'పెళ్ళికూతురు అలిగింది' కథలో ఆదర్శం పాలు ఎక్కువగా వున్నా, చక్కని హాస్యంతో రంగరించి అందించారు రచయిత్రి. అసలు పెళ్ళికూతురు అలిగింది అంటేనే అర్ధమవుతుంది. పెళ్ళికొడుకు అలిగాడు అంటే ఓకే - ఇదేమిటిది? మరి. అదే కథ..

అలాగే 'వదిన కామన్ సెన్స్' - 'ఉపాయం వుందిగా' - 'కలిసి పోరాడుదాం' - 'తెలుసుకొనవె తల్లీ' లాంటి కథలు సరదా సరదాగా వుంటూనే, సమస్యలు, ఆదర్శాలు అందులో ఇమిడి చదవడానికి హాయిగా వుంటాయి.

సుబ్బలక్ష్మి గారి రచనాశైలి ఆసక్తికరంగా వుంటుంది. కథ మొదలుపెట్టాక, పూర్తిగా దానివెంట లాక్కుపోతుంది. అంటే చదివించే మంచి గుణం గల కథలు సుబ్బలక్ష్మిగారి కథలు.

ఆమె మరీ గంభీరమైన సమస్యల్ని తీసుకుని చర్చిస్తూ కథలు వ్రాయడం ఇష్టపడరనిపిస్తుంది.. అంటే సమస్యలపట్ల, స్త్రీల పట్ల సదవగాహన లేదని కాదు సుమా! ఒక్కొక్క రచయిత్రి రచన ఒక్కొక్కలా వుంటుంది. ఆమె ఆలోచన, అభిప్రాయాలను బట్టి రచన సాగుతుంది. అలా రచన సాగినప్పుడే దానికొక నిండుతనం, సార్ధకత వస్తుంది.

సుబ్బలక్ష్మిగారు నాకు మంచి మిత్రురాలు. తరుచు కలుసుకుని కబుర్లు చెప్పుకోలేకపోయినా, కలుసుకున్న కాస్సేపూ ఎంతో ఆత్మీయంగా మసులుకుంటాము.

రచయిత్రి జి.సుబ్బలక్ష్మి ఇంకా రకరకాల విషయాల గురించి అవగాహన కలిగించుకుని మంచి మంచి కథలు వ్రాయగలరని ఆశిస్తున్నా. ఆమెకు నా అభినందనలు.

- ఇంద్రగంటి జానకీబాల

Preview download free pdf of this Telugu book is available at Ee Premalinte