-
-
ఈ క్షణం ధ్యానం
Ee Kshanam Dhyanam
Author: Jakka Pradeep
Publisher: Victory Publishers
Pages: 126Language: Telugu
అసలు 'ఈ క్షణం' ధ్యానం అంటే ఏమిటి?
మనందరికీ ధ్యానం గురించి తెలుసు. అయితే 'ఈ క్షణం' ధ్యానంకు సరైన నిర్వచనం ఏమిటి?దాన్నే ఇప్పుడు మీ ముందు వుంచబోతున్నాను. మనందరిలో ప్రతి ఒక్కరికీ ఈ అభిప్రాయం వుంది.
'ధ్యానం అంటే రోజుకు పదిహేను నుండి అర్థగంట వరకూ కళ్ళు, మూసుకుని శ్వాస మీద ధ్యాసనో, మంత్రజపమో చేయడమని'.
ఇది చాలా సంకుచిత ఆలోచన అని నా అభిప్రాయం అంటే - రోజుకు కేవలం అర్థగంట మాత్రమే మనశ్శాంతిగా వుంటూ మిగిలిన సమయం టెన్షన్తోనూ, అశాంతితోనూ, అస్తవ్యస్తంగా గడపడం మన జీవితం గురించి అవగాహన లోపాన్ని సూచిస్తుంది.
ఇప్పుడు మీకొక సందేహం కలగొచ్చు.
రోజంతా మనశ్శాంతిగా వుండటం ఎలా?
దానికి సమాధానం ఇదే...
''ఒకే రోజులో ఎన్నో క్షణాలు వున్నాయి. అందులో ప్రతి ఈ క్షణాన్ని గమ్యంగా వుంచుకుంటూ మనకు వచ్చే, మానసిక ఉద్వేగాలను, ఆలోచనలను, ఈ నిమిషంలో పాజిటివ్‌గా వుంచుకోవడం, ప్రతి క్షణం ఉపయోగకరంగా గడుపుతూ, జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే...
'ఈ క్షణం' ధ్యానం.
అంటే?
సాధారణంగా మనం చేసే పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన ఆలోచనలు ఈ క్షణంలో వుంటాయి. అందుకే 'ఈ క్షణం ధ్యానం' ద్వారా ఈ క్షణం మీద ధ్యాస పెట్టటం వల్ల జీవితం ఫలవంతం చేసుకోవచ్చనే ఆలోచనలతో మీరు ఏకీభవిస్తే ముందుకు సాగండి.
- రచయిత
Very good book