-
-
ఏ కథలో ఏముందో
Ee Kathalo Emundo
Author: C. Umadevi
Publisher: J.V.Publications
Pages: 104Language: Telugu
Description
కథలు చెప్పకు అంటే కథలల్లకు అనే భావమే స్ఫురిస్తుంది. అయితే ఆకట్టుకునే విధంగా కథలుండాలంటే అక్షరాలకు నగిషీలు చెక్కితే చాలదు... అక్షరం మనసును సూటిగా తాకి ఆపై నాటుకుపోవాలి. అదీ కథ! కథలు చెప్పకు అనకండి! ప్రతి కథా రచయిత, రచయిత్రి తమ రచనలకు తామే మొదటి సమీక్షకులు. అక్షరంపై మక్కువ పెంచుకున్న కథకులు, కవులు తాము ఎంతో ఇష్టంగా రచించిన రచన పాఠకులను చేరాలని, కథ, నవల, కవిత ఏ రూపమైనా సరే తన రచనాచిత్రం చదువరులను మెప్పించాలనే కోరుకుంటారు. పాఠకులందించే వైవిధ్యభరితమైన అభిప్రాయాలు రచన పదవీకాలానికి సూచికలే! రచనలపై కురిసే ప్రశంసలైనా, విమర్శలైనా సాహిత్యానికి మెచ్చుతునకలే! రచించేటప్పుడు రచయిత(త్రి) పొందిన అనుభూతిని, చదివేడప్పుడు పాఠకుడు ఆస్వాదిస్తాడు. రచయితకు, పాఠకుడికి ఏర్పడ్డ ఈ అక్షరవారధిలో కథలోని ప్రాత్రలు హృదయానికి హత్తుకుంటాయి. ఆ పాత్రల ప్రవర్తన, సంభాషణలు, భావోద్వేగాలన్నీ అక్షర శిల్పులు చెక్కిన కథాశిల్పాలు, కవులు గీసిన కవితాచిత్రాలు. ఏ కథను చదివినా, కవితను చదివినా ఒక్క మెతుకు కాదు ప్రతి మెతుకు పట్టి చూడాలనుకునే మనస్తత్వం ఎన్నో రచనలను చదివించింది. ప్రతి రచనలోనూ అంతర్లీనంగా ప్రవహించే భావధారలను ఆప్యాయంగా ఒడిసిపట్టుకుని "ఏ కథలో ఏముందో" అని ముందుగా రుచికి కాస్త ఉప్పందించే సమీక్షలను పాఠకులకు అందించే అతి చిన్న ప్రయత్నమిది. నా సమీక్షలు మీ సంవీక్షణకే!
- సి. ఉమాదేవి
Preview download free pdf of this Telugu book is available at Ee Kathalo Emundo
Login to add a comment
Subscribe to latest comments
