-
-
ఈ కథకి శిల్పం లేదు
Ee Kathaki Shilpam Ledu
Publisher: Palapitta Books
Pages: 192Language: Telugu
"తెలివైన పాఠకుడు ఏకాంతంగా చదువుకోవడానికి ఉద్దేశింపబడ్డా సాహిత్య ప్రక్రియ కథ" - వల్లంపాటి వెంకట సుబ్బయ్య.
మనుషుల్నీ మనస్తత్వాల్నీ అర్థ చేసుకోవడానికీ... సమూహాల విలువలని నిర్ధారించడానికీ జీవన చలన సూత్రాల్ని గ్రహించడానికీ తద్వారా ప్రతి ఒక్కరూ తమని తాము నిర్వచించుకోవడానికి ఉపకరించే సామాజిక శాస్త్రమే సాహిత్యం.
శాస్త్రం అన్నాక పరీక్షలు తప్పవు!
విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఉపాధ్యాయులు మార్కులు వేస్తారు.
ఒక వేళ ఉపాధ్యాయుల చేత పరీక్షలు రాయించి... విద్యార్థుల చేత మూల్యాంకనం చేయిస్తే...? అయ్యవార్లకి అవే నిఖార్సయిన గీటురాళ్ళవుతాయి.
తొలిసారిగా తెలుగు కథని విమర్శనాత్మకంగా చదివి, దానిని విశ్లేషించి రచయిత స్థాయిని నిర్ధారించే అవకాశాన్ని కల్పించడం ద్వారా పాఠకుల ప్రాధాన్యతతో బాటుగా బాధ్యతని కూడా పెంచాడీ రచయిత.
'ఈ కథకి శిల్పం లేదు' అనేది ఈ పుస్తకం పేరు. కానీ.... ఆ పేరు కలిగిన కథ ఈ పుస్తకంలో లేదు. ఎందుకనేది తెలిస్తే నాలాగే మీరూ హాశ్చర్యపోతారు.
- కూచి
