-
-
ఏడు గంటల వార్తలు
Edu Gantala Vartalu
Author: Kolluri Soma Sankar
Publisher: Self Published on Kinige
Pages: 114Language: Telugu
“నాలుగయిదు పేజీల చిన్న కథలు కొన్ని. పదిహేను పేజీల పెద్ద కథలు మరికొన్ని. నిడివి సంగతి ఎలా ఉన్నా కథల్లోని అంతఃసూత్రం - జీవితం.
సుదూరపు కెనడా నుంచి పక్కనే వున్న నేపాల్ వరకూ ఆయా జీవితాలను, జనజీవన సరళినీ తెలుగు పాఠకుల దగ్గరకు చేర్చే పధ్నాలుగు కథలు. నూట ఏభై ఏళ్ళనాటి అమెరికా అంతర్యుద్ధం నుంచి వర్తమాన కాలపు కజకిస్థాన్ భాషా సమస్య దాకా చరిత్రకూ, సంస్కృతికీ వారధిలా నిలచే కథలు.
సగానికి పైగా కథల్లో యుద్ధం, హింస, రక్తం కథా వస్తువు. కనీసం నేపథ్యం. యుద్ధ నేపథ్యమే అయినా కథల్లో కనిపించేది అచ్చమైన జీవితం అన్న స్ఫురణ మనకు కలుగుతుంది. 'ఆ తుపాకీ మొనలపైనే గడ్డిపూలు పూయడం' లాంటి మానవత్వపు పరిమళం కథల్లో కనిపించి సంతోషపరుస్తుంది. ప్రపంచం మీదా, భవిష్యత్తు మీదా నమ్మకం కలిగిస్తుంది. అనువాదానికి ఆయా కథల ఎంపిక యథాలాపంగా జరిగిందని అనుకోను. కథల ఎంపిక వెనుక ఆలోచన ఉంది, ఒక పద్ధతి ఉంది...
జీవితపు సంక్లిష్టతలను ఉద్వేగ భరితంగా మనసును తాకేలా చెప్పే కథలు ఇవి. మన ఆలోచనా ధోరణిని మరికాస్త విశాలం చేసి ప్రపంచాన్ని మరికొంచెం స్పష్టంగా చూడటానికి ఉపకరించే కథలు ఇవి.
మనిషికి ఉన్న సద్వ్యసనాల్లో మంచి పుస్తకాలు చదవడం ఒకటి. ఈ ‘ఏడు గంటల వార్తలు' ఆ వ్యసనానికి తోడ్పడే పుస్తకం."
- దాసరి అమరేంద్ర
