-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు (free)
Edava Prapancha Telugu Sahiti Sadassu - free
Publisher: Vanguri Foundation of America
Pages: 514Language: Telugu
14 దేశాల నుండి.. 175 మంది సాహితీవేత్తల ప్రసంగాలు... 16 పుస్తక ఆవిష్కరణలు... 15 వేదికలు, ఒక జీవన సాఫల్య పురస్కారం, నిర్విరామంగా 36 గంటలు...జీవిత కాలం నెమరు వేసుకునే జ్ఞాపకాలు.. ఇవీ క్లుప్తంగా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విశేషాలు.....ఇవన్నీ పొందుపరిచిన అపురూపమైన జ్ఞాపికగా ఈ సభా విశేష సంచికని సగౌరవంగా, సవినయంగా, సగర్వంగా తెలుగు సాహిత్య ప్రపంచానికి ఉచితంగా అందిస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా పాతిక వేల మందికి పైగా వీక్షించిన ఈ 7వ ప్రపంచ సాహితీ సదస్సు అంతర్జాల ప్రపంచంలో కానీ, మరెక్కడా కనీ వినీ ఎరుగని అద్వితీయ కార్యక్రమం అని అన్ని మాధ్యమాలు గుర్తించి ప్రస్తుతించాయి. ఉభయ ఆంధ్ర రాష్ట్రాల నుండే కాక, తెలుగేతర రాష్ట్రాల నుండి, ప్రపంచంలోని ఐదు ఖండాలలోని 14 దేశాల నుండి తెలుగు ప్రతినిధులు, కవులు, రచయితలు పాల్గొని, తెలుగు సాహితీ జగత్తుకు కొత్త వన్నెలు అద్దిన కార్యక్రమంగా అందరి మన్ననలు పొందిన ఈ సదస్సు అంతవరకు జరిగిన 6 ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులకు ఎంతో భిన్నంగా, పాల్గొన్నవారందరికీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోయే స్థాయిలో జరిగింది. 36 గంటలు నిరాటంకంగా సాగిన ఈ సాహితీ యజ్ఞ ఫలాలని భావితరాల కోసం అక్షరబద్ధం చేయాలన్న సంకల్పానికి ప్రతిరూపమే ఈ "7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక".
- వంగూరి చిట్టెన్ రాజు
రాధిక మంగిపూడి
శాయి రాచకొండ
గమనిక: "7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" ఈబుక్ సైజు 9 mb
