-
-
దుర్గాబాయి దేశ్ముఖ్
Durgabai Deshmukh
Author: Madiraju Govardhan
Publisher: Swathi Book House
Pages: 40Language: Telugu
మన దేశం రెండు వందల సంవత్సరాలకు పైగా విదేశీపాలనలో ఉంది. ఈ కాలంలో మనం పలురీతుల నష్టపోయాం. పరాయి పాలనలో మన గ్రామీణ పరిశ్రమలు కుంటుపడ్డాయి. చేతివృత్తులు కనుమరుగైనాయి. పాడిపంటలు తగ్గాయి. నీటి వసతి లేక వ్యవసాయం కోలుకోలేదు. ఒక విధంగా స్వావలంబన శక్తి, అనగా స్వయంగా బతికే శక్తి క్రమంగా దూరమైంది. దాంతో ప్రజలు పలు బాధలకు గురయ్యారు. విముక్తి కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. ఈ తరుణంలో దాదాబాయి నౌరోజి, బాలగంగాధర తిలక్ తదితర త్యాగమూర్తుల కృషితో జాతీయోద్యమం ప్రారంభమైంది.
తదుపరి గాంధీజీ నాయకత్వం వహించి, ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్ళారు. గ్రామాల నుంచి చదువు రానివారు సైతం జాతీయోద్యమానికి ఉత్తేజులై అందు పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు. ఈ సమయంలో రాజమండ్రికి చెందిన, సంప్రదాయ కుటుంబానికి చెందిన ఒక బాలిక జాతీయోద్యమానికి ప్రేరేపితురాలైనది. అంకిత భావంతో అందు ప్రవేశించింది. పలు ఉద్యమాలలో, ఆందోళనలలో పాల్గొని ఇరవై సంవత్సరాల ప్రాయంలో గాంధీజీ మెప్పు పొందింది. ఆమే బెన్నూరి దుర్గాబాయమ్మ. ఆ పిదప దుర్గాబాయి దేశ్ముఖ్గా మారారు. దేశంలో ప్రముఖ సంఘ సేవకురాలిగా, ఉదాత్త వనితగా పేరు తెచ్చుకున్నారు.
