-
-
దుంపకూరలు - ఆకుకూరలు - కాయగూరలు
Dumpakuralu Akukuralu Kayaguralu
Author: Sri Andra Seshagirirao
Publisher: Mohan Publications
Pages: 224Language: Telugu
నిత్యమొకే రుచిగల ఆహారము తినతగదు. దినమునకొక్క రుచి చొప్పున తినుచున్న సప్తధాతువృద్ధి కనుకూలముగా నుండును. నిత్యమిప్పటి ప్రపంచ ప్రజలు త్రాగే కాఫీ, టీలొకే రుచిగా లెక్కింపబడు నిదానారోగ్యమునకు నాంది దేవతని చెప్పవలసియున్నది. ఏడాదికారు ఋతువులు గనుక యా ఋతువులకుండే గుణానుసారముగా తిండి తినవలెను. వసంత ఋతువుతో సంవత్సరారంభమగును గనుకీ ఋతువందు మధువుత్పన్నమగును. ఇద్దోషము హరించే వేపపువ్వు పచ్చడి, వేపగింజలను నేతితోవేయించి కొద్దిగ ఉప్పుకారములుచేర్చి పొడిచేసి తినవలసియున్నది. ఈ ఋతువు, తరువాత గ్రీష్మ ఋతువేతించును. దీని లక్షణము తాపము పెంపొందింపగలది ఇది పోగొట్టేందుకు తాపహరములైన పెద్దవుశిరిక పండ్ల పచ్చిడి, పప్పుకూర, ఎండుద్రాక్షపండ్ల రసము, చెరకురసము, ఆనప, దోస, పుచ్చకాయవంటి ద్రవ్యములను సేవింప వలెను; దీని అనంతరము వర్షఋతువరుదెంచును, ఈ కాలమందు వాతశ్లేష్మ హరములైన కాకర, పొట్ల బీరలవంటి కూరలతో పాటు వాకుడు, పెద్దములక్కాయ, వుస్తి పండులవంటి వాటికూర, పులుసులను తిన్నచో ఈ రకాల దోషప్రభావము మనుజదేహముపై పెద్దగచూపలేదు. దీని తరువాత శీతాకాలం వస్తుంది. ఇది మంచును కురిసేదగుటచే అధిక వేడినివ్వగల తోటకూర, నల్లేరు పచ్చడి, పులుసు, కూర, నెల్లికూరపులుసుల వంటి ఉష్ణమెచ్చించేవి తినవలెను. శిశిరఋతువునందు సమతత్వముగల బీర, పొన్నగంటి, పులిచింత, చింత చిగురు, షీకాయ చిగురులవంటి మరికొన్ని కూరలను తినుచు కాలమాన స్థితిగతులకనుకూల కూరలు తినేవారికి ఆరోగ్యము బాగుగ నుండును.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE