• Dudi Pinjala Vana
  • fb
  • Share on Google+
  • Pin it!
 • దూదిపింజల వాన

  Dudi Pinjala Vana

  Publisher: Authorspress

  Pages: 140
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

దూదిపింజల వాన


ఏడాకాశాల నక్షత్రాలు మహానగరం పైన
దూది పింజల వానలా ...
మంచుపూల వర్షమై కురుస్తున్నట్టుంది
రాత్రి ప్రేమతో వెన్నెల శాలువా కప్పి
నగరకవిని సన్మానించినట్టుంది
ప్రకృతి కొడుతున్న చప్పట్లకి
శ్వేతపూలు యింకా కురుస్తూనే వున్నాయి
రాత్రి జరిగిన కవి సమ్మేళనానికి
చాలా వాహనాల్లో జనం జాతరగా హాజరైనట్టు
వాహనాల మీద పేరుకున్న పూలవాన...
ఎంత ఇష్టంగా అప్సరసలు నాట్యం చేశారో
రహదారుల వేదిక నిండా వర్షపుజల్లు
సర్వమత సమ్మేళనం నిర్వహించినట్టు
ప్రవక్తలు, ప్రవచన కారులు వచ్చినట్టు
ప్రజలు వెచ్చని దుప్పట్లలో దూరి
నిద్రాదేవి రహస్య గీతం ఆలకించి
ప్రశాంతంగా నిద్ర పోయినప్పుడు
సమాధులు మేల్కొని శ్రోతలయినట్టు
ఎటు చూస్తే అటు మంచుపూల గుట్టలే..
అదిగో చూడండి ..
ఉదయాన్నే నగరాన్ని శుభ్రం చేయడానికి
సూర్యుడు కిరణాల చీపురుతో వస్తున్నాడు ...!!

***

కవిత్వమే నా మార్గం అని చెప్పుకున్నాను యింతకు ముందు సంపుటిలో. బాల్యం నుండే నాన్న లేకుండా అమ్మ నడిపించిన జీవితం కదా, నన్ను నేను ఓదార్చుకోవడానికి కవిత్వం ఆయుధంగా చేపట్టాను. అదే బలమై, బలహీనతై నన్ను నడిపించిందని గట్టిగా నమ్ముతాను. నిజమే కవిత్వం నా ఊపిరిగానే కొనసాగింది. నేను అనుభవించిన లేదా బ్రతికిన సజీవక్షణాల లోంచే నా కవిత్వం యింకా పుట్టుకొస్తుంది. కవిత్వపు ఆసరా ఎంత అవసరమో నా జీవితానుభవం స్పష్టంగా అనుభూతించింది. నా చుట్టూ వున్న సమాజంలో కవిగా నిలబడి వాస్తవాలు అర్ధం చేసుకోవడానికి ఎంతో శ్రమించాలసివచ్చింది. సజీవమైన కవిత్వమయ్యేందుకు ఎన్ని రాత్రుళ్ళని కరిగించానో నాకు మాత్రమే తెలుసు. ఒక సంకల్పంతో, అకుంఠిత దీక్షతో ప్రాంతీయ తెలుగు కవి నుండి జాతీయ కవిగా విశ్వ వేదిక లెక్కిన అంతర్జాతీయ కవిగా రూపాంతరం చెందేందుకు నేనెంత తపస్సు చేశానో వివరించలేను. నా కుటుంబం కోసం కేటాయించాలసిన ఎన్నో గంటలు కవిత్వం కౌగిలిలో కరిగిన క్షణాలే. ఆ తత్వాన్ని తెలుసుకున్నాకే కవిత్వం నన్ను శిఖరాలకు చేర్చింది. అందుకే “మీ కవిత్వం మీ గుండెరెక్కల చప్పుడు" అంటుంది అర్ధం చేసుకున్న సహచరి నా కవయిత్రి శ్రీమతి. ఆమె నా కవిత్వంతో సైతం మమేకమై నా దుఃఖాన్ని సంబరాన్ని తనదిగా భావించి నన్నో జీవవస్తువుగా నిలబెట్టింది. కవిత్వంతో మనిషిని నిత్యం అభిషేకించి మానవతావాదిగా పునీతుడని చేయాలన్నదే నా నిత్య తపన. అవును మనిషిని మనిషిగా మలచడానికే నేను కవి నయ్యాను.

అదే ధర్మంగా, మార్గంగా జీవిస్తాను. మానవతే దీపమై నా కవిత్వం వెలగాలని ఆశిస్తాను. ఆకాంక్షిస్తాను. లోకాన్ని చుట్టిరావడం వల్ల నన్ను నేను విస్తృత పరచుకోగలిగాను. అది నా జీవితంలోను కవిత్వంలోను అనేక వైవిధ్యాలు, వైరుధ్యాలు చూపించింది. ఆనందాన్ని, దుఃఖాన్ని రెండు భుజాలపై మోస్తూ అమ్మ చేతి స్పర్శ లాంటి కవిత్వం పట్టుకుని ఎన్నో సమస్యలను సంక్షోభాలను అధికమించాను. విశ్వ ప్రేమను పరుచుకున్న కవిత్వాన్ని ఆలపించగలిగాను. కవిత్వం చేయి పట్టుకుని కాలచక్రంలో ఒక షష్టిని రెప్పపాటులో పూర్తి చేసినట్టు అన్పిస్తుంది. అందుకు సాక్షిగా 60 కవితలతో కాలానికి అర్చన చేస్తూ యీ నా 'దూదిపింజల వాన' కవితా సంపుటితో విచ్చేస్తున్నా. శార్వరి ప్రారంభంలో ప్రపంచాన్ని కరోనా కర్కశత్వంగా శిక్షిస్తున్న సంక్షోభ సమయంలో సాహసం చేస్తూ ఈ గ్రంథం విడుదల చేస్తున్నా.

- డా. పెరుగు రామకృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Dudi Pinjala Vana