-
-
ద్రోహవృక్షం
Drohavruksham
Author: Dr. V. Chandrasekhar Rao
Language: Telugu
"బైబిలు, న్యూ టెస్ట్మెంటు, జీసస్ క్రైస్టు గురించి వినే ఉంటావు. క్త్రెస్టుని శిలువ వేయడానికి పట్టి ఇచ్చిన శిష్యుడి పేరు జూడా. క్రైస్టుని పట్టి ఇచ్చినాక పశ్చాత్తాపపడి 'పవిత్ర రక్తాన్ని మోసం చేసిన పాపిని' అంటూ ఆవేదనపడి, ఊరి బయటనున్న ఒంటరి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మరుసటి రోజు చెట్టు మొత్తం వెలిగిపోయి, దాని కొమ్మల నిండా ఎర్రటి పూలు (జూడా చెట్టు ఎర్రగా వెలిగిపోతుంటుంది) పూశాయి. ఆ చెట్టే ఇది" అని క్షణం సేపు ఆగి, "ఈ రంగు పూలను చూసి మోసపోకు. దీని అందాలను చూసి మోహపడకు. ఇది నమ్మకద్రోహం నుంచి పుట్టిన అందం" అని "నా జుట్టు చూశావా? ఎర్రటి రంగులో మిలమిలలాడుతూ, బహుశా జూడా రక్తం నాలోనూ పారుతోందేమో?" అని, మళ్ళీ కొద్దిక్షణాలు ఆగి, "నా పేరు ఉ. కొండయ్య. మనిద్దరం ముప్ఫయేళ్ళ క్రితం ఈ ప్రాంతాల్లోనే తిరిగాము. బహుశా నీకు గుర్తు ఉండి ఉండదు. సిటీ మనిషి వయ్యావు. అయ్యేయస్ పరీక్షేదో రాసినట్టున్నావు. మనం మళ్ళీ ఇట్లా, జూడాస్ చెట్టు దగ్గర కలుసుకోడం కాకతాళీయం మాత్రం కాదు."
"మైకులో ప్రకటన విన్నావు కదా, ఒక సభ కాదు. రెండు సభలు జరగబోతున్నాయి. బహుశా కొట్లాటలు కూడా జరగవచ్చు. బహుశా ఎర్రటి జూడా పూలరంగు రక్తాలు కూడా పారవచ్చు. ఇక అడవంతా ఎర్రపూల సౌందర్యమే. నీ కుంచె పట్టనంత..."
"ఉ.కొండయ్యను. గుర్తుకొచ్చానా?" అంటూ గంభీరంగా అడుగు వేసుకుంటూ ఊరువైపుకు నడిచాడు అతను.
