-
-
ద్రష్ట - దృశ్యం వేర్వేరా, లేక ఒకటేనా?
Drashta Drusyam Ververa Leka Okatena
Author: Neelamraju Lakshmi Prasad
Pages: 48Language: Telugu
నీవు నిజంగా, గాఢంగా ప్రేమించిన ఓ మిత్రుడో నీ భార్యో గతించడం సంభవించింది. ఆ వ్యక్తితో నీ మొత్తం సంబంధం, సాన్నిహిత్యం అంతమొదింది. నీ జీవితంలో ఆ మనిషితో నెఱపిన సంబంధమే. ఆ ఒక్కటే, ఎంతో అర్థవంతమైనది ; చివరకు అదీ అంతమయేసరికి, భరించలేని ఒంటరితనం నిన్ను అలముకున్నది; ఓర్చుకోలేని, సహింపలేని వియోగం.
ఆ పరిస్థితితో అలాగే వుండిపో. ఆలోచనా రహితంగా, ఏ అనుభూతిని దరిచేరనివ్వకుండా, ఏదీ జోక్యం చేసుకోనివ్వకుండా ఉండిపో. తప్పించుకో చూడద్దు, ఏదీ అణగత్రొక్కద్దు, విశ్లేషించవద్దు.
ఇక ఇప్పుడు ఆ అసాధారణమైన ఘటన (phenomenon) సంభవిస్తుంది. ఎంతో ప్రియమైన సాన్నిహిత్యంతో కూడుకున్న ఒక వ్యక్తిని పోగొట్టుకున్నప్పుడూ, నిష్కర్ష చేసి నిశ్చయానికి వచ్చిన అత్యంత ప్రియమైన ఒక విషయం ముగిసిపోయినపుడూ, నీవు ముక్కలు చెక్కలైపోతావు. అది వున్నంత కాలం, ఉండిన మానసికస్థితి :సంపూర్ణంగా అంతమై పోయింది. ఎదో ఒకభావి వుంటుందని నువు సృష్టించుకొని విశ్వసించవచ్చు. కానీ అదినీ మానసిక సృష్టే. ఇక్కడ జరిగిన ఈ అంతం, ఏ భావీ లేకుండా అంతమైనట్లే. మనసు, ఈ యథార్థాన్ని అర్థం చేసుకొని ఉండిపో గలదా? యథార్థాన్ని గమనిస్తున్న వాడు (observer) గా కాదు.
ఎందుచేతనంటే గమనిస్తున్న వాడే (observer). కనిపించే ఆ యథార్థం, ఆ మానసిక స్థితే, గమనిస్తున్నవాడని గ్రహించు. అందుచేత ఆ గమనిస్తున్నానని అనుకునే వాడికీ, గమనించబడుతున్న విషయానికీ భేదమేమీ లేదు. అతడే ఆ దుఃఖం, అతడే ఆ అంతం.
- జిడ్డు కృష్ణమూర్తి

- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162